కాజల్ బాయ్‌ఫ్రెండ్సా మజాకా

కాజల్ బాయ్‌ఫ్రెండ్సా మజాకా - Sakshi


  ఈతరం హీరోయిన్లకు బాయ్‌ఫ్రెండ్ లేరంటే నమ్మశక్యం కాని విషయం. ఇక నటి కాజల్‌అగర్వాల్ విషయానికొస్తే ఎక్కచక్కంగా బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారట. షూటింగులు లేకుంటే ఈ బ్యూటీ తన బాయ్‌ఫెండ్స్‌తోనే గడిపేస్తారట. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ మధ్య షూటింగ్ స్పాట్‌కు కూడా వచ్చేసి కాజల్‌తో బాతాఖానీ కెట్టేస్తున్నారట ఆమె బాయ్‌ఫ్రెండ్స్. దీంతో చిత్ర దర్శకులకు ఇబ్బందిగా ఉండడంతో కాజల్ అగర్వాల్‌పై విరుచుకు పడుతున్నారట.


ఇక లాభం లేదని ఈ అమ్మడు బాయ్‌ఫ్రెడ్స్‌ను దూరం పెట్టక తప్పలేదట. అయితే ముంబయ్ వెళితే మాత్రం బాయ్‌ఫ్రెండ్స్‌తో కాజల్ చేసే గలాటా  అంతా ఇంతా కాదట. ప్రస్తుతం కాజల్ కోలీవుడ్‌లో విక్రమ్ సరసన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. విశాల్‌తో నటించిన పాయంపులి చిత్రం సెప్టెంబర్ 4న విడదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అనీ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందనే ఆశాభావాన్ని ఆదివారం జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కాజల్ వ్యక్తం చేసింది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top