ధీరన్‌కు నివాళి


టీనగర్, న్యూస్‌లైన్: ధీరన్ చిన్నమలై 258వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం వద్ద గురువారం ముఖ్యమంత్రి జయలలిత నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు ధీరన్ చిన్నమలై జయంతి సందర్భంగా గురువారం గిండలో ఉన్న ఆయన విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ విగ్రహం కింద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జయలలిత మధ్యాహ్నం 12.15 గంటలకు అక్కడికి చేరుకుని విగ్రహానికి నమస్కరించి, అక్కడ ఉన్న చిత్రపటానికి  పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం జయలలిత అక్కడున్న కార్యకర్తలకు అభివాదం చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, మంత్రులు వలర్మతి, అబ్దుల్ రహీం, చిన్నయ్య, మేయర్ సైదై దురైస్వామి, మాజీ మంత్రులు గోకుల ఇందిరా, సెంతమిళన్, జిల్లా కార్యదర్శులు వి.పి.కలైరాజన్, బాలగంగా, విరుగై రవి, అశోక్, ఢిల్లీ ప్రతినిధి జక్కయ్యన్, న్యాయవాది పళని తదితరులు పాల్గొన్నారు.   

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top