నేను ఓ మోస్తరు ఫిగర్ని

నేను ఓ మోస్తరు ఫిగర్ని


చాలా మంది హీరో యిన్లు ఒక స్థాయికి చేరుకున్న తరువాత ఈ ప్రపంచంలో నేనే అందగత్తేనన్నంతగా ఫోజులు కొడుతుంటారు. అలాంటిది నటి సమంత నేను అందగత్తెను కాదుగదా సుమారు ఫిగర్‌ను కూడా కాదంటున్నారు. తెలుగు, తమిళం భాషల్లో నెంబర్ ఒన్ హీరోయిన్ల పోటీలో ముందు వరుసలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన పత్తుఎండ్రదుకుళ్ చిత్రం లోనూ, ధనుష్‌కు జంటగా వీఐపీ2 చిత్రం, విజయ్‌తో కత్తి తరువాత తాజాగా తెరకెక్కనున్న చిత్రంలోనూ నటిస్తున్నారు. వీటితో పాటు మహేశ్‌బాబుకు జంట గా ద్విభాషా చిత్రంలో నటిం చనున్నారు. ఇలా టాప్ హీరోలతో నటిస్తూ యమ బి జీగా ఉన్న సమంత ఇటీవల ఒక భేటీలో తన అందం గరించి మాట్లాడుతూ నేనొక మోస్తరు ఫిగర్‌నన్నారు.

 

 ఆ వ్యాఖ్యలు ఎందరో అభిమానుల గుండెల్ని పిండేశా యో అది వేరే సంగతి. ఆమె మాత్రం సహజ ధోరణితో(కాస్త నిజాయితీతో) చె ప్పుకుపోతూ నిజం చెప్పాలంటే ప్రపంచంలో నాకంటే అందగత్తెలు అనేక మంది ఉన్నారు. వారితో పోల్చుకుంటే నేను అందగత్తెనే కాదు. ఆ విష యం నాకు బాగా తెలుసు. స్కూల్, కాలేజ్ రోజుల్లో ఒక్క అబ్బాయి అ యినా నా వైపు తిరిగి చూస్తే బాగుండునని ఆశించే దాన్ని. అలా ఒక్కరు కూడా తిరిగి చూడ లేదు. అలా నన్ను ఒక నా ర్మల్‌ఫిగర్‌గా కూడా ఎవరూ అంగీకరించలేదు. ఇక నేనిప్పుడు అందంగా కనిపిస్తున్నానంటే నా హేర్ స్టైలిస్ట్ నుంచి మేకప్‌మ్యాన్ వర కూ చాలా మంది కారణమవుతారు. ఇం కా చెప్పాలంటే నేనాశించిన జీవితం లభించడం వల్ల నా అందం మెరుగు లు దిద్దుకుని ఉండవచ్చు అం టోంది చెన్నై చిన్నది సమంత.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top