నేను ఇళయరాజా అభిమానిని

నేను ఇళయరాజా అభిమానిని


చిన్ననాటి నుంచి తాను సంగీత జ్ఞాని ఇళయరాజా అభిమానిని అని అంటున్నారు నటి అనుష్క. తమిళ, తెలుగు భాషల్లో మేటి నటిగా వెలుగొందుతున్న ఈమె తాజాగా నటించిన చిత్రం రుద్రమదేవి. దీనికి ఇళయరాజా సంగీతం అందించారు. గతవారం వరంగల్ వేదికగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఇళయరాజా హాజరుకాలేదు. అయినా ఆయన పేరును పదేపదే అనుష్కతో పాటు అక్కడున్న వారందరూ స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క ఇళయరాజాను చూడటానికి సోమవారం హైదరాబాద్ నుంచి చెన్నైకు వచ్చారు. నగరంలోని ప్రసాద్ స్టూడియోలో రుద్రమదేవి రీరికార్డింగ్‌లో బిజీగా ఉన్న ఇళయరాజాను కలుసుకున్నారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఆనందాన్ని పంచుకున్నారు. తాను ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించినా ఇళయరాజా సంగీతం అందిస్తున్న రుద్రమదేవిలో నటించడం ఆనందంగా ఉందన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top