దీప్తి ఎలా అదృశ్యమైందంటే..

దీప్తి ఎలా అదృశ్యమైందంటే.. - Sakshi


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నాకు ఎలాంటి హానీ తలపెట్టకుండా, డబ్బు రూపంలో డిమాండ్లు చేయకుండా కిడ్నాపర్లు ఆమెను క్షేమంగా వదిలిపెట్టడంతో కథ సుఖాంతమైంది. ఓ మహిళతో కలసి ఇద్దరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. కాగా ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారన్నది పోలీసుల విచారణలో తేలాల్సివుంది. దీప్తి తండ్రి మాత్రం.. ఈ వార్తను మీడియా ఎక్కువగా ఫోకస్ చేయడం, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టడంతో కిడ్నాపర్లు భయపడి తన కుమార్తెను క్షేమంగా విడిచిపెట్టారని చెబుతున్నారు. దీప్తి కిడ్నాప్ ఉదంతంలో ఎప్పుడు ఏం జరిగిందంటే..

 


  • బుధవారం రాత్రి గుర్గావ్లోని స్నాప్ డీల్ సంస్థలో విధులు ముగించుకొని తిరిగివెళ్తుండగా ఘజియాబాద్లో దీప్తి అదృశ్యమైంది

  • దీప్తి షేర్ ఆటోలో వెళ్తుండగా అది చెడిపోవడంతో మరో ఆటోలోకి మారింది. ఈ ఆటోలో ఇద్దరు మగవాళ్లు, ఓ మహిళ ఉన్నారు

  • ఆటోను దారి మళ్లించడంతో దీప్తి ఆటో డ్రైవర్ను ప్రశ్నించింది. వెంటనే ఆటోలో ఉన్న మహిళ కత్తి చూపించి దీప్తిని బెదిరించింది

  • అదే సమయంలో దీప్తి ఫోన్ చేసి తన తండ్రికి విషయం చెప్పింది. ఆటో ఆపాల్సిందిగా దీప్తి వేసిన కేకలు ఫోన్లో తండ్రికి వినిపించాయి. కాసేపటికి ఫోన్ స్విచాఫ్ అయ్యింది

  • దీప్తి తండ్రి ఫిర్యాదు మేరకు 200 మంది పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు

  • కిడ్నాపర్లు రాజ్ నగర్ ఏరియాలో గుర్తుతెలియని ప్రాంతంలో దీప్తిని బంధించారు

  • కిడ్నాపర్లు దీప్తికి ఎలాంటి హానీ తలపెట్టకుండా, భోజనం పెట్టారు (ఈ విషయం దీప్తి పోలీసులకు చెప్పింది)

  • ఆ మరుసటి రోజు ఉదయం కిడ్నాపర్లు రైల్వే స్టేషన్ సమీపంలో దీప్తిని వదిలిపెట్టారు

  • దీప్తి ఓ ప్రయాణికుడి ఫోన్ తీసుకుని తన తండ్రికి సమాచారం అందించింది
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top