మరోసారి సర్కిల్‌రేట్ల పెంపు


 సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో స్థిరాస్తి రేట్లు సక్రమంగా ఉండే లా చూడడంలో భాగంగా సర్కిల్ రేట్లను ఈ నెలాఖరు వరకు పెంచాలని ఢిల్లీ సర్కారు  యోచిస్తోంది. సవరణ తరువాత సర్కిల్ రేట్లు 20 నుంచి 60 శాతం పెరగవచ్చని రెవె న్యూ అధికారులు అంటున్నా రు. ఢిల్లీలో స్థిరాస్తుల విషయం లో ప్రభు త్వ రేట్లకు, మార్కెట్ రేట్లకు మధ్య భారీ తేడా ఉంది. ఈ తేడాను తొలగించడానికి సర్కిల్ రేట్లను సవరించాలని రెవెన్యూశాఖ భావిస్తోంది. ఒక స్థలాన్ని రిజిస్టర్ చేయడానికి ప్రభుత్వం ప్రాంతాల వారీగా నిర్ణయించే కనీస ధరను సర్కిల్ రేటు అంటారు. ఉదాహరణకు కేటగిరీ ‘ఎ’ కిందకు వచ్చే జోర్‌బాగ్, గోల్ఫ్‌లింక్స్ వంటి సంపన్న కాలనీలు, డిఫెన్స్ కాలనీ వంటి ‘బి’ కేటగిరీ కాలనీల్లో సర్కిల్ రేటు చదరపు కిలోమీటరుకు 6.5 లక్ష ల రూపాయలు ఉంది. పంజాబీబాగ్ వంటి ‘సి’ కేటగిరీ కాలనీల్లో సర్కిల్ రేటు రూ.1.32 లక్షలు ఉంది. ‘హెచ్’ కేటగిరీ కాలనీలో సర్కిల్ రేటు చదరపు కిలోమీటరుకు రూ.19, 400గా ఉంది. ప్రభుత్వం నిర్ణయించే ఈ కనీస ధరకన్నా మార్కెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే రిజిస్ట్రేషన్ సమయంలో చూపించే ధరలకు వాస్తవ ధరలకు ఎంతో తేడా ఉంటుంది.

 

 నల్లధనం రూపేణా జరిగే ఈ లావాదేవీల కారణంగా ప్రభుత్వం భారీ ఆదాయాన్ని కోల్పోతోంది. సంపన్న కాలనీకు సంబంధించి తేడా అధికంగా ఉండడం వల్ల వాటి సర్కిల్‌రేట్లు భారీ గా పెంచనున్నారు. ఈ కాలనీలకు వర్తిం చే ఏ, బీ కేటగి రీల ధరలతో పాటు ఫామ్‌హౌస్‌లు, వ్యవసాయ భూముల ధరలను భారీగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతమున్న సర్కిల్ రేట్లకు, మార్కెట్ రేట్లకు మధ్య తేడాను ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలిస్తోంది. కొన్ని రోజుల తరువాత ఇది తన సిఫారసులను ఆర్థిక విభాగానికి సమర్పిస్తుంది. సవరించిన రేట్ల ప్రతిపాదనలను లెప్టినెంట్ గవర్నర్ ముందుంచి అనుమతి తీసుకుం టుంది. ప్రస్తుతం ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేనందువల్ల ఆర్థిక విభాగం ప్రతిపాదన లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందవలసి ఉంటుంది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top