‘కల్వకుర్తి’కి అన్యాయం చేసింది కాంగ్రెస్సే

‘కల్వకుర్తి’కి అన్యాయం చేసింది కాంగ్రెస్సే - Sakshi


2012లో డీపీఆర్‌లో ఎన్ని నీళ్లస్తారో పేర్కొనలేదు: హరీశ్‌



సాక్షి వనపర్తి: రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పుట్టగతులు ఉండవని భారీనీటి పారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఇక తమకు భవిష్యత్‌ ఉండదని భావించి కొందరు కోర్టులను అడ్డం పెట్టుకొని కిరికిరి చేస్తున్నా రని మండిపడ్డారు. ఆదివారం ఆయన వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఖిల్లాఘన పురం, పెబ్బేరు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడారు.



2012లో కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ టెండర్‌ ప్రక్రియ సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్వకుర్తి ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇస్తారో డీపీఆర్‌లో ఎక్కడా పేర్కొనలేదని హరీశ్‌ గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కల్వకుర్తి ప్రాంతానికి అన్యాయం జరిగిందనడం సిగ్గుచేటన్నారు. రూ.105 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మామిడిమాడ చెరువును పూర్తిచేసి 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.



ప్రారంభించిన పనులివే..

వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మామిడిమాడ వద్ద నేరేడుచెరువు, వేముల వాణి చెరువులను కలిపి నిర్మించే బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మిషన్‌ కాకతీయ మూడో విడత పనులను ఘనసముద్రం చెరువులో ప్రారం భించారు. రూ.2.7కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేయనున్నారు. ఖిల్లాఘనపురం బ్రాంచ్‌ కెనాల్‌ పైలాన్‌ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.



ఎన్ని అడ్డంకులెదురైనా ‘పాలమూరు’ పూర్తిచేస్తాం

పాలమూరు ఎత్తిపోతల పథకం పనులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని హరీశ్‌ ఆరోపించారు. మన ప్రాజె క్టులను నిర్లక్ష్యం చేస్తూ... హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, మచ్చెమర్రి ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో కృష్ణా జలాలలను తరలించుకుపోయార న్నారు. ఎవరెన్ని అడ్డం కులు సృష్టించినా ప్రాజెక్టుల విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top