గడ్డాలు పెంచితే అభ్యర్థులు గెలుస్తారా..

గడ్డాలు పెంచితే అభ్యర్థులు గెలుస్తారా.. - Sakshi


ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సర్వే పచ్చి బూటకం

వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి




సాక్షి, సూర్యాపేట: ‘ఆచరణకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీని ఎండగట్టడం పోయి వారికి మద్దతుగా ఉంటున్న కాంగ్రెస్‌ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 70 స్థానాలు ఎలా గెలుస్తుంది.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డాలు, మీసాలు పెంచినంత మాత్రాన అభ్య ర్థులు గెలువరు’అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ్‌ చేయించిన సర్వేలో రాష్ట్రంలో 70 స్థానాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని చెప్పడం విడ్డూమన్నారు.



ఆ సర్వే వట్టి బూటకం అని విమర్శించారు. మూడు నెలల క్రితం వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో సర్వే చేయించామని, దాంట్లో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఆయన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలు గెలవడం కష్టమన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ నాయ కులు తమ పార్టీ నుంచి ఒకొక్కరు వలసలు వెళ్తున్నా వారిని నిరోధిం చడంలో విఫలమయ్యారని విమ ర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని.. ఆయన కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించారని కొనియాడారు.



వైఎస్సార్‌ లాంటి నాయకుడు ప్రస్తుతం కాంగ్రెస్‌లో లేరన్నారు. వైఎస్‌ హయాం కాంగ్రెస్‌కు స్వర్ణయుగం లాంటిదని, ఆరోజులు ఇక రావని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఏనాడూ ప్రజల సమస్యల గురించి ప్రస్తావించకపోవడం శోచనీయ మన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ రాక చదువులు మధ్యలోనే ఆపేస్తు న్నారని, ఆరోగ్యశ్రీ పథకానికి తిలోదకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ఏ నాయకుడూ నోరు మెదపడంలేదని పేర్కొ న్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్య దర్శి దొంతిరెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top