మార్కెట్‌లో మక్క రైతుల ఆందోళన

మార్కెట్‌లో మక్క రైతుల ఆందోళన

రూ.400ల వరకు తగ్గించిన వ్యాపారులు

ఏ పద్ధతిన నిర్ణయించారని ప్రశ్నించిన రైతులు

కనపడకుండాపోయిన ఉద్యోగులు 

పోలీసు బందోబస్తుతో తక్కువ ధరతో కొనసాగిన క్రయవిక్రయాలు

 

వరంగల్‌ సిటీ: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మక్క రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాళ్‌కు రూ.1800కు పైచిలుకు పలికిన ధర, ఒక్కసారిగా రూ.1455–1060కు పడిపోవడంతో మక్క రైతుల ఆవేశం కట్టలు తెంచుకుంది. రైతులు పెద్ద ఎత్తున యార్డు వద్దకు చేరుకోని ఏ పద్ధతిన ధరను నిర్ణయించారని, ఎందుకు ధర తగ్గించారో తెలుపాలని అడుగుతుండగానే యార్డు ఇంచార్జితో సహా ఉద్యోగులంతా ఉడాయించారు. సమాధానం చెప్పడానికి ఉద్యోగులు, వ్యాపారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో  రైతులకు మరింతగా కోపం వచ్చి.. ఓ దశలో గన్ని బ్యాగులను తగులబెట్టే ప్రయత్నం చేశారు. మార్కెట్‌ ఉద్యోగులు  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐలు భీంశర్మ, బాలాజీవరప్రసాద్‌లు యార్డుకు చేరుకుని,  గొడవలు కాకుండా నియంత్రించారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులతో రైతులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎందుకు ధర తగ్గించారో చెప్పాలని, కనీసం రూ.1500తోనైనా కొనుగోలు చేస్తే తాము ఊరుకుంటామని సీఐ భీంశర్మతో వాదించారు. దీనికి సీఐ సమ్మతించి యార్డు ఇంచార్జీ, ఉద్యోగులను పిలిపించి అడ్తి, వ్యాపారులతో మాట్లాడాలని సూచించారు. అందుకు వ్యాపారులు ససేమిరా అన్నారు. వ్యాపారులతో మాట్లాడి ఒప్పించడానికి అటు కార్యదర్శి, మార్కెట్‌ చైర్మన్ ఎవరూ ప్రయత్నించ లేదు. చివరకు పోలీసు బందోబస్తుతో తక్కువ ధరతోనే కొనుగోళ్లు నడిచాయి.

 

యార్డు ఇన్‌చార్జి అత్యుత్సాహంతోనే గొడవ

కాగా మక్క రైతుల ఆందోళనకు ప్రధాన కారుకుడు యార్డు ఇంచార్జీనే అని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర నిర్ణయం కాకముందే మైక్‌లో రూ.1555 పెట్టే ధరను రూ.100తగ్గించి 1455కే అనౌన్స్ చేశాడని, దీంతో వ్యాపారులు అనౌ¯Œ్స అయ్యాక ఎట్టి పరిస్థితిలో ధర పెంచేది లేదని, ఒక వేళ పెంచితే ఇక ప్రతి రోజు అలానే ఉంటుందని ఖారాకండిగా తెలిపారు. అసలు ధరకు రూ.100 ఎందుకు తగ్గిం చావని యార్డు ఇంచార్జీని అడిగితే బిత్తర చూపులు తప్పా సమాధానం లేదు. యార్డు ఇంచార్జీ గత రెండు సంవత్సరాలుగా ఒకరిద్దరు అడ్తి దారులను గుప్పెట్లో పెట్టుకోని ఇలానే చేస్తున్నాడని ఉద్యోగులు వాపోయారు. అతడిని మార్చాలని పలవురు ఉద్యోగులు బాహాటంగానే అంటున్నారు.

 

మార్కెట్‌కు రాని చైర్మన్.. 

నూతనంగా నియమితులైన మార్కెట్‌ చైర్మ¯ŒS ధర్మరాజు మార్కెట్‌కు రాలేదు. మార్కెట్‌కు బయలుదేరే సమయంలో గొడవ విషయం తెలుసుకుని ఆగిపోయారని పలువురు మాట్లాడు కోవడం కనిపించింది. ఇక మార్కెట్‌కు సుమారు 30వేల బస్తాల మక్కలు అమ్మకానికి వస్తే.. ఉదయం మెసేజ్‌లో 18,471 బస్తాలు వచ్చినట్లు ధర రూ.1445–1060 పలికినట్లు పంపించారు. తీరా మార్కెట్‌ అధికారికంగా ప్రకటించే ధరల్లో 19వేల బస్తాలు అమ్మకానికి వచ్చినట్లు ధర రూ.1445–1375 పలికినట్లు ధరల పట్టికను పంపించారు. ఈ లెక్కన ఎన్ని క్వింటాళ్ల మక్కలు అమ్మకానికి వచ్చాయో, ఏధర పలికిందో, ఓపె¯ŒS టెండరా...నామ్‌ విధానమా అనేది మార్కెట్‌ ఉద్యోగులకే తెలియని పరిస్థితి.

 

మార్కెట్‌లో అంతా మోసమే 

మార్కెట్‌లో మొత్తం ఎటు చూసినా మోసంతో కూడిన వ్యాపారమే. హమాలీ కూలీల నుంచి అడ్తి, వ్యాపారుల వరకు చివరకు ఉద్యోగులతో సహా రైతుల నుంచి ఎంత మేరకు దండుకోవాలనే ఆలోచనే తప్పా మరోటి లేదు.  తిరిగి మక్కలను ఇంటికి తీసుకుపోలేక తప్పని సరి పరిస్థితిలో అమ్మకుంటున్నాం. ఏమైనా మాట్లాడితే ఎవరినైనా అడుగుదామంటే పోలీసులు తీసుకుపోతున్నారు.

– బానోతు మోతీలాల్, మక్క రైతు
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top