ప్రేక్షకులే నా ఆనందానికి కారణం

ప్రేక్షకులే నా ఆనందానికి కారణం


 ప్రేక్షకుల అభిమానమే నా ఆనందానికి, ప్రకాశానికి, మనసోల్లాసానికి కారణం అంటున్నారు ఎవర్‌గ్రీన్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి అంటున్నారు. దక్షిణాదిన మేటి హీరోయిన్‌గా వెలిగి ఆపై ఉత్తరాదిన దేదీప్యమానంగా ప్రకాశించిన శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను వివాహమాడి నటనకు దూరం అయ్యారు. అయితే కళామతల్లి ఒడిలో పసితనం నుంచి ఆటలాడుకున్న శ్రీదేవి ఆ తల్లికి దూరం అవడం అంత సులభం కాదు. అన్నట్లుగా సుమారు 15 ఏళ్ల తరువాత ఇంగ్లీష్ వింగ్లీష్ అంటూ తెరపైకి వచ్చారు. శ్రీదేవి నటించాలే గాని ఎప్పుడైనా ఆదరిస్తాం అంటూ అభిమానులు నిరూపించారు. ఆ తరువాత చాలా భాషల నుంచి చాలా అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. అయితే పాత్రల విషయంలో ఆచితూచి అడుగేస్తున్న శ్రీదేవి 2012లో నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం తరువాత తమిళంలో పులి చిత్రంలో మహారాణిగా నటిస్తున్నారు. చాలా కాలం తరువాత నటిస్తున్న తమిళ చిత్రం ఇది. ఈ సందర్భంగా శ్రీదేవి ఒక తమిళ పత్రికకు ఇచ్చిన భేటీ చూద్దాం...



 ప్రశ్న: సినిమాకు చాలా కాలం దూరంగా ఉండడానికి కారణం?

 జవాబు: సినిమా నేను తప్పటడుగుల్లోనే ఆడుకున్న స్థలం. నాలుగేళ్ల వయసు నుంచే షూటింగ్ స్పాట్, కెమెరా, స్క్రిప్ట్, నటన అంటూ వేగంగా జీవితాన్ని గడిపిన నటిని. అయితే వివాహానంతరం కె మెరాకు దూరంగా కుటుంబం, పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నాను. అంతకంటే ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.



 ప్రశ్న: మళ్లీ నటించడం ప్రారంభించారు. ఎలా ఫీలవుతున్నారు?

 జవాబు: సినిమాల్లో నటించకపోయినా చిత్రాలను కుటుంబంతో కలిసి చూస్తూ ఆనందిస్తున్నాను. సినిమా చర్యలను గమనిస్తూనే ఉన్నాను. వీలయినప్పుడల్లా అభిమానులను కలుసుకుంటునే ఉన్నాను.



 ప్రశ్న:  చిత్రరంగంలో గమనిస్తున్న మార్పులు?

 జవాబు: బాలీవుడ్ ప్రపంచ సినిమా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంతో బ్లాక్‌బస్టర్ కొడుతోంది. 3డీ, సీజీ అంటూ నవీన సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయ సినిమా ప్రకాశిస్తుంది.



 ప్రశ్న: మహిళా దర్శకురాలి దర్శకత్వంలో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రాలు చేసిన అనుభవం గురించి?

 జవాబు: ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్ర కథను దర్శకురాలు గౌరి చెప్పినప్పుడు కథపై ఆమె తీసుకున్న శ్రద్ధ నన్ను ఆకట్టుకుంది. అందుకే ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. గౌరి దర్శకత్వంలో నటించడం ప్రత్యేకమైన అనుభవం.



 ప్రశ్న: నిర్మాత భార్య అయిన మీరు చిత్ర నిర్మాణంలో జోక్యం చేసుకునే అవకాశం వుందా?

 జవాబు: అలాంటిదేమీ ఉండదు. నేను కథ, కథనాల కనుగుణంగా నటిస్తాను. లాభనష్టాల గురించి బేరీజు వేసుకుంటూ ఉంటే నష్టాలే ఏర్పడుతాయి.



 ప్రశ్న: వెండితెర తారలు బుల్లితెరపై వ్యాఖ్యాతలగా వ్యవహరించడం, నటించడం గురించి మీ అభిప్రాయం

 జవాబు: వెండి తెర అయినా, బుల్లితెర అయినా అలాగే నటన అయినా వ్యాఖ్యాతగా అయినా అంగీకరిస్తే అంకిత భావంతో పని చేయాలన్నది నా భావన. నాకు ఇప్పటి వరకు సరైన, ఆక ర్షణీయమైన బుల్లితెర అవకాశం రాలేదు. అలాంటివి వస్తే తప్పకుండా నటిస్తాను.



 ప్రశ్న: బాలీవుడ్‌లో నేటి తారల్లో నచ్చిన హీరోయిన్?

 జవాబు: విద్యాబాలన్, రాణి ముఖర్జి. వీరిద్దరూ నన్ను బాగా ఆకట్టుకున్న నటీమణులు. వారు నటించిన కహాని, దర్టీ పిక్చర్, గో ఒన్ గిల్డ్ గిసిక చిత్రాలు నన్ను ఆశ్చర్యపరిచాయి.



 ప్రశ్న: నేటికీ ప్రకాశించే మీ మేనందాల రహస్యం?

 జవాబు: ప్రేక్షకులు ప్రేమాలయనాలే. మనిషి గుణగణాలు వారి ముఖంలో కనిపిస్తాయని నమ్ముతాను నేను. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్‌తో సంతోషంగా జీవిస్తున్నాను. నా మేనందానికి ఇది ఒక కారణం కావచ్చు.



 ప్రశ్న: మీ ఇద్దరి కూతుళ్లలో బాగా అల్లరి పిల్ల ఎవరు?

 జవాబు: రెండవ కూతురు ఖుషి బాగా అల్లరి చేస్తుంది. బాగా ఆటపట్టిస్తుంది కూడా.



 ప్రశ్న:  పెద్దకూతురు జననిని కథానాయికగా పరిచయం చేయనున్నారనే ప్రచారం గురించి?

 జవాబు: ఇప్పటి వరకు తాను నటించే విషయం గురించి నిర్ణయం జరగలేదు. జనని జీవితం గురించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది. తొందర పాటు తనంతో సినిమా రంగంలోకి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని పాడు చేయడం నాకిష్టం లేదు. జనని స్థిరమైన మనస్థత్వం కోసం ఎదురు చూస్తున్నాం.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top