పవన్ కల్యాణ్ అయినా ఒకే

పవన్ కల్యాణ్  అయినా ఒకే - Sakshi


అజిత్, విజయ్ లేదంటే పవన్‌కల్యాణ్ అయినా ఓకే అంటున్నారు దర్శకుడు సుశీంద్రన్. ఇంతకీ ఆయన చెప్పాలనుకుంటున్నదేమిటి? తొలి చిత్రం వెన్నిలా కబడ్డీ కుళు చిత్రంతోనే పోరాడి గెలిచిన దర్శకుడీయన.ఆ తరువాత దర్శకుడిగా వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం ఆయనకు లేకపోయింది.ఇప్పటికి ఎనిమిది చిత్రాలు చేశారు.వీటిలో తాజా చిత్రం విశాల్ కథానాయకుడిగా నటించిన పాయంపులి.కాజల్‌అగర్వాల్ కథానాయిక గా నటించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.ఈ సందర్భంగా సుశీంద్రన్‌తో చిన్న చిట్‌చాట్.

 

 ప్ర: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్ర టైటిల్‌లో విశాల్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించే ధైర్యం చేశారు.ఈ చిత్ర వివరాలను క్లుప్తంగా చెప్పండి?

 జ: ఇది పోలీస్ అధికారి ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం.విశాల్ ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో పోలీస్ పాత్రల్లో నటించారు.అయితే వాటన్నిటికీ భిన్నంగా ఈ చిత్రంలో ఆయన పాత్రను మలచడం జరిగింది.

 

 ప్ర:మీరింతకు దర్శకత్వం వహించిన పాండినాడు చిత్రంలో విశాల్‌నే హీరో. ఆ చిత్రానికి ఈ పాయుమ్‌పులి చిత్రా

 నికి ఆయన నటనలో వ్యత్యాసం గురించి?


 జ: పాండినాడు చిత్రంలో విశాల్ భయపడే స్వభావిగా నటించారు.పాయుమ్‌పులి చిత్రంలో అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో చూపించాను.చిత్రం చూస్తే తొలి పది నిమిషాల్లోనే ఆ వ్యత్యాసం మీకే అర్థం అవుతుంది. ఎవరూ ఊహించని విధంగా కొత్త విశాల్‌ను ఇందులో చూస్తారు.

 

 ప్ర:పాయుమ్‌పులి చిత్రంలో ప్రత్యేకత?

 జ: నేను ఇంతకు ముందు కథ,కథనాలు సిద్ధం చేసుకున్న తరువాతే ఎవరు నటించేది,నిర్మాత ఎవరు?అన్న విషయాల్లో ముందుకెళ తాను.అయితే పాయుమ్‌పులి చిత్రానికి విశాల్ కథానాయకుడు అని నిర్ణయించుకుని కథ,కధనాలు తయారు చేశాను.

 

 ప్ర: ఇప్పటికి ఎనిమిది చిత్రాలు చేశారు.ఏమనిపిస్తుంది?

 జ: ఎనిమిది చిత్రాలతో చాలానే నేర్చుకున్నాను.నా తొలి చిత్రం వెన్నెలా కబడ్డీ కుళు.ఆ చిత్రం ఇచ్చిన సంతృప్తి,విజయం ఏ చిత్రం అందించలేదు.

 

 ప్ర:టోటల్‌గా చిత్రపరిశ్రమ గురించి మీ అభిప్రాయం?

 జ; నిజం చెప్పాలంటే సినిమా శ్రమతో కూడుకుందే.సహాయ దర్శకుడి దశతో ఒక రకమైన పోరాటం అయితే తొలి అవకాశం వచ్చినప్పుడు మరో రకం పోరాటం.చిత్రం విజయం సాధిస్తే దాన్ని నిలుపుకోవడానికి ఇంకో రకం పోరాటం చెయ్యాలి.

 

 ప్ర: తదుపరి చిత్రం గురించి?

 జ; సాదారణంగా నాకు కథ,కధనం రెడీ చెయ్యడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది.అలాంటిది ఇప్పుడు తదుపరి చిత్రానికి కథ సిద్ధంగా ఉంది.ఈ కథ అజిత్‌కు అయినా విజయ్ కయినా నప్పుతుంది.అలాగే తెలుగు స్టార్ నటులు పవన్‌కల్యాణ్ లేదా మోహన్‌బాబు అయినా నటించవచ్చు.మంచి సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top