మంత్రుల వివరాలివే..

మంత్రుల వివరాలివే..


సాక్షి, ముంబై: ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎంతోపాటు ఎనిమిది మంత్రి కేబినెట్ మంత్రులు, ఇద్దరు సహాయ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వారి వివరాలిలా ఉన్నాయి...



ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ :

మహారాష్ట్రంలో బీజేపీ మొదటి ముఖ్యమంత్రి. విదర్భ రీజియన్ నుంచి నాలుగో ముఖ్యమంత్రి. నాగపూర్ నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. 2013లో బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా నియామకం.

 

క్యాబినెట్ మంత్రులు

ఏక్‌నాథ్ ఖడ్సే: ముక్తాయినగర్ నియోజకవర్గంలో వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. కాషాయ కూటమి ప్రభుత్వంలో ఆర్థిక, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.  



సుధీర్ మునగంటివార్ : వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడి గా పనిచేశారు. కాషాయ కూటమి సర్కారులో పర్యటన, వినియోగదారుల సంరక్షణ మంత్రిగా పనిచేశారు.

 

వినోద్ తావ్డే : విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నాయకుడు. ముంబై బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి.

 

పంకజా ముండే: పర్లీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. బీజేపీ కోర్ కమిటిలో సభ్యురాలు. దివంగత గోపినాథ్ ముండేకు రాజకీయ వారసురాలు.

 

ప్రకాశ్ మెహతా: ఘాట్కోపర్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముంబై బీజేపీ మాజీ అధ్యక్షుడిగా, కాషాయ కూటమి సర్కారులో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.  

 

విష్ణు సావరా : విక్రంగఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆరు పర్యాయాలు విధాన్‌సభకు ఎన్నికయ్యారు. ఆదివాసుల నాయకుడిగా గుర్తింపు. కాషాయ కూటమి సర్కారులో గిరిజిన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

 

చంద్రకాంత్ పాటిల్: కొల్హాపూర్ ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

 

సహాయ మంత్రులు

విద్యా ఠాకూర్ : గోరేగావ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ తరఫున ఉత్తర భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. ముంబై డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. బీఎంసీనుంచి నాలుగు పర్యాయాలు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.



దిలీప్ కాంబ్లే : పుణే కంటోన్మెంట్ నుంచి రెండోసారి గెలిచారు. కాషాయ కూటమి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. బీజేపీలో దళిత నాయకుడిగా గుర్తింపు ఉంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top