ఢిల్లీ వర్సిటీలో ఎన్నికల సందడి


 న్యూఢిల్లీ బ్యూరో: ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్నికల సందడి నెలకొన్నది. యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డూసూ) ఎన్నికల ప్రచారం మొదలైంది. సెప్టెంబర్ 12వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు తమ ఎజెండాలతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ ఆయా విద్యార్థి సంఘా లు క్యాంపస్‌లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.  సెప్టెంబర్ 12వ తేదీన డూసూ ఎన్నికలు జరగనున్నా యి. అదే నెల 3వ తేదీలోగా అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. 5వ తేదీ లోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.

 

 ప్రచారంలో మాతృసంస్థల నాయకులు

 విద్యార్థి ఎన్నికల ప్రచారంలో ఆయా మాతృ సంస్థ లు కూడా పాలుపంచుకొంటున్నాయి. ఈసారి కేం ద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. అదే ఉత్సాహంతో దాని అనుబంధ సంస్థ అయిన సంస్థ అఖిల భార త విద్యార్థి పరిషత్( ఏబీవీపీ) యూనివర్సిటీ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల  సూచనల మేరకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలనే ఆలోచనలో పడింది. బీజేపీ సీనియర్ నేతలు విద్యార్థి విభాగం ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినాయువ నేతలు మాత్రం ప్రచారంలోకి దిగుతున్నారు. శుక్రవార బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నార్త్ కేంపస్‌లోని ఎస్‌ఆర్‌సీసీ కళాశాలను సందర్శిం చారు. కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, అస్కార్ ఫెర్నాండెజ్, అర్విందర్ సింగ్ లవ్లీ తదిత రులు ఎన్‌ఎస్‌యూఐ విజయం కోసం రంగంలోకి దిగారు.

 

 క్యాంపస్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వయంగా విద్యార్థులను కలుస్తూ ఎన్‌ఎస్‌యూఐకు అండగా ఉండాలని కోరుతున్నారు. ఎన్‌ఎస్‌యూ కార్యకర్తలు పలు విద్యార్థి సమస్యలపై వీథి నాటకాలను ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రత, ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల భద్రత, వసతులు,  క్రీడల మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై విద్యార్థులను చైతన్యం చేస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఒక అడుగు ముందుకేసి క్యాంపస్‌లో వసతి సదుపాయాలపై రైట్‌టు అకామిడేషన్ ప్రచారోద్యమాన్ని  ప్రారంభించింది. రాను న్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో ఆప్ నాయకత్వం తలమునకలై ఉంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) అనుబంధ విద్యార్థి విభాగం డుసూ ఎన్నికల్లో పోటీచేయరాదని ఆ పార్టీ విద్యార్థి విభాగం చాత్ర యువ సంఘర్ష్ సమితి ( సీవైఎస్‌ఎస్) నిర్ణయించింది.

 

 12న జెఎన్‌యూ ఎన్నికలు

 న్యూఢిల్లీ: సెప్టెంబర్ 12న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(జేఎన్‌యూఎస్‌ఐ) ఎన్నికలు జరుగుతాయని విశ్వవిద్యాలయం ఎన్నికల విభాగం ప్రకటించింది. 3వ తేదీ మంగళవారం నాటికి నామినేషన్ల దాఖలు చేయాలని, బుధవారం నుంచి ప్రచారాన్ని నిర్వహించాలని ఎన్నికల విభాగం అధికారి పేర్కొన్నారు.  

 

 ఒకేసారి ఎన్నికలు

 ఈసారి జేఎన్‌యూఎస్‌ఐ, ఢిల్లీ యూనివర్సిటీల విద్యార్థి విభాగం ఎన్నికలు ఒకేసారి వ చ్చాయి. గత సంవత్సరం జరిగిన జేఎన్‌యూఎస్‌ఐ ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్‌ఐ) కీలక పదవులను గెలుచుకొంది. సీపీఎం అనుబంధ స్టూడెంట్స్ యూనియన్ ( ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(డీఎస్‌ఎఫ్) ఈ సారి కూటమిగా ఎన్నికల బరిలో దిగు తున్నాయి.

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top