ఎమ్మెల్యే హసన్‌పై దాడి హేయం


 సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే హసన్ అహ్మద్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయడాన్ని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ తీవ్రంగా ఖండించారు. లక్నోలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే హసన్ అహ్మద్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి ముఖేశ్‌శర్మతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటి దాడులకు పాల్పడడం సరికాదన్నారు. హసన్ అహ్మద్‌పై దాడిని పార్టీ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చే సినట్టు వారు పేర్కొన్నారు.

 

 నగరవ్యాప్తంగా కార్యకర్తలు శనివారం ఆందోళనలకు దిగారని తెలిపారు. లక్నోలో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే హసన్ అహ్మద్‌పై అక్కడి యువకులు కొందరు శుక్రవారం దాడి చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న హసన్ అక్కడి హోటల్‌లో సమావేశం నిర్వహిస్తున్నప్పుడు 15-20 మంది యువకులు దాడి చేశారు. స్థానిక షియా మతగురువు కల్బే జవ్వాద్‌కు వ్యతిరేకమని ఆరోపిస్తూ తనపై దాడి చేశారని బాధితుడు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఢిల్లీలోని ముస్తాఫాబాద్ ఎమ్మెల్యే అయిన హసన్ అహ్మద్ అన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top