లోకాయుక్తా వస్తే 'అమ్మ' జైలుకే

లోకాయుక్తా వస్తే 'అమ్మ' జైలుకే - Sakshi


జవదేకర్ జోస్యం

సాక్షి, చెన్నై: రాష్ట్రంలోకి లోకాయుక్తా వస్తే, అమ్మ మళ్లీ జైలు కెళ్లినట్టే. అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ నినాదం ఆమె నోటి మాటే, అని చమత్కరిస్తున్నారు. రాష్ర్టంలో అవినీతి నిర్మూలన లక్ష్యంగా రాజకీయ పక్షాలన్నీ నినాదాల్ని అందుకుని ఉన్నాయి. ఇందులో బీజేపీ కూడా ఉంది. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, ప్రజాసంక్షేమ కూటమి, కాంగ్రెస్ ఇలా ఎవరికి వారు విడుదల చేసుకున్న మేనిఫెస్టోల్లో ‘లోకాయుక్తా’ నినాదం తప్పని సరిగా ఉన్నాయి. అవినీతిని రూపు మాపాలంటే లోకాయుక్తాతోనే సాధ్యం అన్నట్టుగా ప్రచారాల్లో గళం విప్పే పనిలో పడ్డాయి.



ఇంతవరకు బాగానే, ఉన్నా లోకాయుక్తా వస్తే మాత్రం జైలుకు వెళ్లేది జయలలితే అని గంటాపథంగా జవదేకర్ వ్యాఖ్యానిస్తుండడం గమనించాల్సిన విషయమే. చెన్నైలో శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన జవదేకర్ జయలలితను ఉద్దేశించి సెటెర్లు విసిరారు. గతంలో ఇంటికి 20 లీటర్ల ఉచిత మినరల్ వాటర్ అని ప్రకటించి లీటరు రూ. పదికి అమ్ముకున్న వాళ్లు, విద్యుత్ మిగులు అని ఎన్నికల ఫీట్లు చేస్తున్న వాళ్లు, ఇప్పుడేమో లోకాయుక్తా అన్న నినాదం అందుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. లోకాయుక్త అమ్మ పెదవి నోటి మాటకే పరిమితం. అది అమలయ్యేది డౌటే. ఎందుకంటే, అది వస్తే జైలుకు వెళ్లేది జయలలితే అని చమత్కరించడం గమనార్హం.

 

ఈ పరిస్థితుల్లో  ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తు ల కేసు సుప్రీంలో వి చారణలో ఉన్నం దు, రాష్ట్రంలో లోకాయుక్తా అవసర మా..? అని పెదవి విప్పే అన్నాడీఎంకే వాళ్లూ ఉన్నారు. అదే సమయంలో లోకాయుక్త వస్తే, అమ్మ ఒక్కట్టేనా...?తాతయ్య అండ్ ఫ్యామిలీ వెళ్లదా..? అని జవదేకర్‌కు ప్రశ్నల్ని సంధించే వాళ్లు  ఉండడం ఆలోచించాల్సిందే. అవినీతిలో డీఎంకే, అన్నాడీఎంకేలు దొందు దొందే అని వ్యాఖ్యానించే కమలం పెద్ద, ఒక్క అమ్మకే జైలు అని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top