బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమ్మె


తిరువళ్లూరు : టెలిఫోన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరువళ్లూరు జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజు సమ్మె ను పాటించారు. జిల్లా వ్యాప్తంగా వున్న బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనబాట పట్టారు. తిరువళ్లూరు ప్రధాన కార్యాలయం వద్ద జరిగి న ఆందోళనకు ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు మది వానన్ అధ్యక్షత వహించగా, జేఏసీ నేతల గోవిందరా జ్, లింగమూర్తి, విజయకుమార్, అన్బురాజ్, మురుగన్‌తోపాటు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది ఉద్యోగులు హాజరయ్యారు.



ఈ సందర్బంగా జేఏసీ నేతలు పలువురు మాట్లాడుతూ ఉన్నత అధికారులు అధికారిక పర్యటనలు, విదేశీ పర్యటనల పేరిట కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని, అయితే సామాన్య ఉద్యోగికి మాత్రం అందాల్సిన వేతనాలను పెంచడం కోసం ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు నిల్వ వున్న వేతనాలను పెంచడం, 2007 తరువాత వచ్చిన ఉద్యోగులకు వేతనాల సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. అర్హత ఉన్న వారికి ప్రమోషన్‌లను కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.



టెలిపోన్ శాఖలో పని చేసి పదవీ విరమణ పొందిన వారికి 78.2 శాతం ఐడీఏ చెల్లించాలని, వారసులకు ఉద్యోగం ఇచ్చే విషయంలో వున్న కఠిన నిబంధనలను వెంటనే సుల భతరం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర సదుపాయాలను కల్పించాలని, తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించడంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్‌ఐలను వర్తింప చేయాలని సూచించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు జేఏసీ నేతలతో పాటు వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top