‘బంగారం’లాంటి ఐడియా!

‘బంగారం’లాంటి ఐడియా! - Sakshi

  • నల్ల కుబేరుల బ్లాక్‌ టు వైట్‌ ‘పథకం’

  • బ్యాంకులోని ఆభరణాలు విడిపించేందుకు పాతనోట్లతో అప్పు

  • వడ్డీ లేకుండా అసలు ఆరు నెలల్లో ఇచ్చేలా ఒప్పందాలు

  • ముందుజాగ్రత్తగా ప్రామిసరీ నోట్లు, చెక్కులు తీసుకుంటున్న వైనం



  • సాక్షి, అమరావతి: ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు కానీ రద్దయిన పెద్ద నోట్లు మార్చుకునేందుకు దండిగా ఉపాయాలు పుట్టుకొస్తున్నాయి. కేవలం రూ.రెండున్నర వేలకోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూకట్టి సామాన్యుడు రోజుల తరబడి సతమవుతుంటే ధనవంతులు దర్జాగా పెద్ద నోట్లు మార్చుకునే పనిలో పడ్డారు. గతంలో భూములు, బంగారం పరపతికి ప్రతీకగా భావించేవారు. తాజాగా పెద్ద నోట్ల రద్దుతో పాత పద్ధతి వైపు దృష్టి మరలింది. బంగారం, భూములపై నల్ల డబ్బు పెట్టుబడికి దారులు వెదుకుతున్నారు. బంగారం షాపుల్లో లెక్కల్లో చూపని బంగారం బిస్కెట్లను పాత నోట్లతో కొనుగోలు చేస్తున్నారు. వంద గ్రాముల బంగారం బిస్కెట్‌ గురువారం నాటి మార్కెట్‌లో రూ.3.15 లక్షలుండగా ఆ మొత్తానికి మరో రూ.10 వేలు అదనంగా ఇచ్చి పెద్ద నోట్లను చెలామణి చేస్తున్నారు. దీనికితోడు బ్యాంకుల తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించే లా పెద్ద నోట్లు పరుస్తున్నారు.



    వ్యవసాయం, ఇంటి ఖర్చుల కోసం బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆభరణాలను విడిపించే మిషతో రూ.500, 1000 నోట్లను విరివిగా వినియోగంలోకి తెస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజులుగా బ్యాంకు తాకట్టులో ఉన్న బంగారం వస్తువులను విడిపించే ఒప్పందాలు జోరందుకున్నాయి. తెలిసిన వారివి, బంధు మిత్రులవి బంగారం నగలను బ్యాంకుల నుంచి విడిపించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో  అవసరార్థం తీసుకున్న అప్పలు తీర్చలేక అవస్థలు పడుతున్న సగటు జనం కొత్తగా వచ్చిన అవకాశంపై ఆసక్తి చూపుతున్నారు. స్వామికార్యం స్వకార్యం అన్నట్టు బ్యాంకులో ఉన్న నగలను సొంత డబ్బుతో పనిలేకుండా విడిపించుకోవడంతోపాటు తెలిసిన వారికి సాయం చేసినట్టు అవుతుందనే కొత్త తరహా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.



    వడ్డీలేని అప్పుగా పెద్ద నోట్లు పెట్టుబడి..

    పెద్ద నోట్లు మార్చేందుకు మధ్యవర్తులు 15 నుంచి 40 శాతం కమిష¯ŒS వసూలు చేస్తుండటంతో బం గారం తాకట్టు నుంచి విడిపించే పేరుతో పెద్ద మొత్తాల్ని పెట్టుబడి పెడుతున్నారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఒక రైతు వ్యవసాయ పెట్టుబడి కోసం రెండు బ్యాంకుల్లో తీసుకున్న రూ.1.20 లక్షలను సకాలంలో చెల్లించలేకపోయారు. బ్యాంకు అప్పు తీసుకుని రెండో ఏడాది గడుస్తుండటంతో ఆ రైతు బకాయిని పాతనోట్లుతో తీర్చేలా ఆదే ప్రాంతానికి చెందిన పెద్ద ఆసామి ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు వడ్డీతో సహా బ్యాంకులో రూ.500, రూ.1000 నోట్లతో బాకీ తీర్చిన పెద్ద ఆసామి ఆ మొత్తాన్ని వడ్డీ లేకుండా తనకు ఆరు నెలల్లో తిరిగి వ్వాలంటూ పెద్దల సమక్షంలో కాగితాలు రాయిం చుకున్నారు.



    అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఉండి లో ఒక రైతు కుటుంబ అవసరాల కోసం బంగారం నగలపై రూ.3 లక్షలు బ్యాంకు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా బ్యాంకులో చెల్లిం చేందుకు ఒక ఆసామి సెటిల్మెంట్‌ చేసుకున్నారు. తీరా ఆ రైతుకు పా¯ŒS కార్డు లేకపోవడంతో బ్యాంకు అప్పును రూ.50 వేల లోపు మొత్తాల చొప్పున దఫదఫాలుగా జమ చేసి మొత్తం బంగారం అప్పును రూ.3 లక్షలు వడ్డీతో తీర్చాలని బ్యాంకు అధికారులు సూచించారు. ఎలాగైనా పర్వాలేదు పెట్టుబడిగా పెద్ద నోట్లిస్తానని ఒక పెద్ద ఆసామి ఒప్పుకు న్నారు.



    ఇలా రాష్ట్రవ్యాప్తంగా బంగారం రుణాల్ని రదై్దన పెద్ద నోట్లుతో తీర్చే వెసులుబాటుతో పెద్దలు భారీగానే వడ్డీలేని పెట్టుబడులు పెడుతున్నారు. కాగా, బంగారం రుణాల్ని తీర్చేందుకు పెద్ద నోట్లు ఇస్తున్న ధనవంతులు ఆలస్యమైనా కొత్త నోట్లు రాబట్టుకునేందుకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆభరణాలపై అప్పులు తీర్చినందుకు అసలును 6 నెలల్లో చెల్లిం చేలా రుణగ్రస్తులతో అంగీకారపత్రాలు రాయించుకుంటున్నారు. మరీ పెద్ద మొత్తాలైతే ప్రామిసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేయించుకుని ముందు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top