వైఎస్‌ జగన్‌ దీక్షతో దిగొచ్చిన కేంద్రం


నేలకొండపల్లి : రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు దీక్షతో కేంద్రం దిగొచ్చిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ దీక్ష వలన తెలుగు రాష్ట్రాలకు కొంత మేరకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌ యార్డ్‌ ఘటన రైతులు కడుపు మండి చేసిందని ఆయన అన్నారు. దీనికే అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రౌడీలు అనటం సమంజసం కాదన్నారు. 

 

రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంత్రి తుమ్మల ప్రతిపక్షాలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహారించుకోవాలన్నారు. మిర్చి మార్కెట్‌ అంతా దళారులకు వేదికగా మారిందన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో ఖర్చు చేసిన  నిధులపై శ్వేత ప్రతం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌ యార్డ్‌ పాత కాలం నాటిది కనుక సౌకర్యాలు ఉన్న ప్రాంతానికి మార్కెట్‌ను తరలించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మార్కెట్‌ తరలింపులో అధికార పార్టీ నాయకుల స్వార్థం వలన జాప్యం జరుగుతుందన్నారు. పాలేరు కు పెద్ద పాలేరుగా చేస్తానన్నా తుమ్మల పాలేరు కంటే వైరా ముఖ్యమని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యల పై పోరాటాలు చేయటంలో కాంగ్రెస్‌ విఫలమవుతుందని ఆయన అన్నారు. వామ పక్షాల నాయకులు తమ్మినేని, పువ్వాడ, కూనంనేని సాంబశివరావు లాంటి నాయకులు పదువుల కోసం ఆరాటపడకుండా, పార్టీలు మారకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తున్నారని తెలిపారు. మంత్రి తుమ్మల నియోజకవర్గంలో ఉన్న తన శాఖ విశ్రాంతి భవనం కు కరెంట్‌ కూడ లేకపోవటం ఆయన పని తీరుకు నిదర్శనం అన్నారు.

 

రోడ్డు విస్తరణ పనులో భూములు కొల్పోయిన వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకట్రామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సంపెట వెంకటేశ్వర్లు, తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాధ్యక్షులు వి.సత్యనారాయణరెడ్డి, మట్టా గోవిందరెడ్డి, జిల్లా కార్యదర్శి లు గుగులోత్‌ రూప్లానాయక్, షేక్‌ యాకోబ్‌మియా, పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సైదులు, గుగులోత్‌ నాగేశ్వరరావు, కుక్కల ప్రకాషం, చెరకు రంగయ్య, రాజేందర్, బుడగం శ్రీను, గోవర్ధన్‌చారీ, తిమ్మిడి వెంకటేశ్వర్లు, కుమ్మరికుంట్ల రాములు, హరినా«ద్‌బాబు, పల్లపు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top