ఆ నీచులకు మరణశిక్ష విధించాలి

ఆ నీచులకు మరణశిక్ష విధించాలి


ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కొపార్డి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి, కిరాతకంగా హత్య చేసిన నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే డిమాండ్ చేశారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి, దోషులకు ఉరిశిక్ష వేయాలని హజారే ఓ ప్రకటనలో కోరారు.



గతవారం ముగ్గురు దుండగులు బాధితురాలిని సామూహిక అత్యాచారం చేసి, చేతులు విరిచి, ఆమె శరీరం మొత్తం గాయాలు చేసి గొంతు నులిమి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మహారాష్ట్రను కుదిపేసింది. హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఫడ్నవిస్ ఈ ఘటనపై ప్రకటన చేస్తూ నిందితులను అరెస్ట్ చేశారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చూస్తానని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top