ఆండ్రియాను వదలని కాల్‌గర్ల్..

ఆండ్రియాను వదలని కాల్‌గర్ల్.. - Sakshi


తమిళ సినిమా: ఆండ్రియా మంచి నటి.. గాయని.. కవితలు కూడా బాగా రాస్తుంది. ఇలా మల్టీటాలెంట్‌తో దూసుకెళ్తున్న ఆండ్రియాను.. కాల్‌గర్ల్ పాత్ర వెంటాడుతోంది. తమిళ దర్శకుడు వెట్ట్రిమారన్ చాలాకాలం క్రితమే శింబు హీరోగా వడచెన్నై అనే సినిమా తీస్తానని తెలిపారు. అందులో కాల్‌గర్ల్ పాత్రకు ఆండ్రియాను ఎంపిక చేశారు. అందులో ఆమె పాత్ర చాలా కీలకం అన్నారు.

 

అయితే ఆ చిత్రం ప్రారంభం చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఆ తరువాత వడచెన్నై నుంచి శింబు వైదొలిగారు. దీంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం జోరందుకుంది. అదే సినిమాను ఇప్పుడు ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కించడానికి వెట్ట్రిమారన్ రెడీ అయ్యారు. ఇందులో హీరోయిన్‌గా సమంత, మరో ముఖ్య పాత్రలో విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు.



అయితే.. కాల్‌గర్ల్ పాత్ర మాత్రం ఆండ్రియాను వదలలేదు. ఆ పాత్రను ఆమెతోనే చేయిస్తారట. ఇక పోతే ఆండ్రియా నటుడు శింబుకు చేయూత నివ్వనున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ఇదునమ్మఆళు చిత్రంలో హీరోయిన్ నయనతార. ఆ సినిమాలో ఇంకా రెండు పాటలు పెండింగులో ఉన్నాయి. ఇప్పటికే ఆ సినిమాకు చాలా కాల్‌షీట్స్ కేటాయించానని, ఇక నటించేది లేదని నయనతార ఖరాఖండిగా చెప్పడంతో దర్శకనిర్మాతలకు ఏం చేయాలో పాలుపోలేదు.

 

ఏమీ చేయలేని స్థితిలో దర్శకుడు పాండిరాజ్ ఆండ్రియాను ఆశ్రయించారు. ఆమె పచ్చజెండా ఊపడంతో ఇప్పుడు ఇదునమ్మఆళు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో టి.రాజేంద్రన్ నిమగ్నమయ్యారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top