ఇప్పుడు నా పెళ్లికి తొందరేంటి?

ఇప్పుడు నా పెళ్లికి తొందరేంటి? - Sakshi


 పెళ్లికిప్పుడు తొందరేముంది అంటోంది విజయలక్ష్మి. చెన్నై - 28 చిత్రంలో కథానాయికిగా రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు కెరీర్ తొలి చిత్రంతోనే విజయబాటపట్టినా ఆ తరువాత జోరు తగ్గింది. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదన్నట్లు నటి విజయలక్ష్మి నట జీవితంలోను మళ్లీ వెలుగులు విరబూస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఆడామే జై చోమడా, వెన్నెలా వీడు చిత్రాలు ఈ ముద్దుగుమ్మకు విజయానందాన్ని ఇచ్చాయి. ఈ సందర్భంగా నటి విజయలక్ష్మితో చిన్న ఇంటర్వ్యూ.   

 

 క్రికెట్ తో మీ అనుబంధం ఏంటి?

 క్రికెట్‌ను నేను టీవీలో చూస్తుంటాను. ఫైనల్ మ్యాచ్ అయితే తప్పకుండా చూస్తాను. ఇక అపార్టుమెంట్ కుర్రాళ్లు ఆడే క్రికెట్‌ను సమయం దొరికి నప్పుడల్లా చూస్తుంటా. అవసరం అయితే బాల్‌ను అందిస్తుంటాను. అంతకంటే పెద్దగా ఆ క్రికెట్‌తో అనుబంధం ఏమీ లేదు.

 

వరుసగా రెండు చిత్రాలు విజయం సాధించడంపై మీ అనుభూతి?

 నా చిత్రాలు హిట్ అయ్యాయా? ఫ్లాప్ అయ్యాయా అన్న విషయం గురించి పెద్దగా పట్టించుకోను. నేను చేసే ప్రతి పాత్రకు న్యాయం చేయడానికే కృషి చేస్తాను. వాటిలో కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. దాన్నే హిట్ అంటున్నారు. అలా ప్రేక్షకులకు నచ్చిన చిత్రాలే ఆడామై జై చోమడా, వెన్నెలా వీడు. హిట్ అరుుతే అందరికీ ఆనందమే కదా!.

 

వెన్నెలా వీడు చిత్రంలో గ్రామీణ ఉపాధ్యాయురాలిగా నటించారు. ఆడామై జై చోమడాలో ఇడ్లీలు అమ్ముకునే యువతిగా నటించారు. ఈ రెండింటిలో మీకు నచ్చిన పాత్ర?

నిజం చెప్పాలంటే నేను టీచర్ అవ్వాలన్నది చిన్ననాటి కోరిక. అది సినిమా ద్వారా నెరవేరడం సంతోషంగా ఉంది.

 ఇడ్లీలు అమ్ముకునే యువతిగా చాలా జాలీ పాత్రలో నటించే అవకాశం రావడం సరికొత్త అనుభవం. ఈ చిత్రం కోసం ఇడ్లీ వ్యాపారులను బాగా అబ్జర్వ్ చేశాను. వారి మేనరిజాన్ని చిత్రంలో అలాగే ప్రదర్శించాను.

 

మీ నాన్న (అగస్థ్యన్) దర్శకత్వంలో నటించే చిత్రం ఎంత వరకు వచ్చింది?

ఆ చిత్ర షూటింగ్‌కు చిన్న గ్యాప్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే నాన్నను అడగాల్సిందే.

 

ఇక్కడ ఏడేళ్లరుునా మీ కంటూ ఒక స్థానం లేదే?

ఇక్కడ నా స్థానం, మీ స్థానం అంటూ ఏమీ ఉండదు. ఏ స్థాయి ఎవరికీ నిరంతరం కాదు. నేను నటించిన చిత్రాలు తక్కువ కావచ్చు. అయితే నా నటనను ఏ చిత్రంలోనూ ఎవరూ కొరత చూపలేదు. దీన్ని నేను ఘనంగా భావిస్తాను.

 

ఈ సినీ జీవితంలో బాధ కలిగించినవి?

రెండు విషయాలు మాత్రం నన్ను తీవ్రంగా బాధించాయి. వనయుద్ధం చిత్రంలో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిగా నటించాను. ఆ పాత్ర కోసం కారడవుల్లో కష్టపడి నటించాను. అయితే కొన్ని సమస్యల కారణంగా ఆ సన్నివేశాలొక్కటి కూడా చిత్రంలో చోటు చేసుకోలేదు. అదే విధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన సుల్తాన్ ది వారియర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోవడం చాలా బాధనిపించింది.

 

వివాహం ఎప్పు డు చేసుకుంటారు?

నేను ఎప్పుడు చెప్పేదే. పెళ్లికిప్పుడు తొందరేముంది. ఇంకా కొన్నేళ్లు నటనపైనే దృష్టి సారించాలనుకుంటున్నాను.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top