భవన శిథిలాల్లో 400 కిలోల బంగారం

భవన శిథిలాల్లో 400 కిలోల బంగారం - Sakshi


టీనగర్‌(చెన్నై): చెన్నై సిల్క్స్‌ భవన శిథిలాల్లో నాలుగు వందల కిలోల బంగారు నగలతో రెండు లాకర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై టీనగర్‌లోగల చెన్నై సిల్క్స్‌ ఏడంతస్తుల భవనంలో మే 31వ తేదీ రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా మంటల్లో దగ్ధం కాగా కోట్లాది రూపాయల విలువైన వస్త్రాలు, నగలు మంటల్లో కాలిపోయాయి.



ఈ భవనం కూల్చివేత పనులను రాష్ట్ర ప్రజాపనుల శాఖ చేపట్టి, సుమారు 20 రోజులు నిర్వహించింది. ఈ పనులు మంగళవారంతో పూర్తయ్యాయి. ఇలావుండగా ఈ భవనంలోని రెండు నగల లాకర్లు శిథిలాల్లో ఉండడం అధికారులు గుర్తించారు. బుధవారం ఈ రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 400 కిలోల బంగారు నగలు, రెండు వేల కిలోల వెండి ఉన్నట్లు తెలిసింది. వీటి విలువ రూ.120 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top