'పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తుంది. ఈ తృప్తి చాలు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం క్రీడలుకథ

కెప్టెన్సీ లేదుగా... సిక్సర్లు కొడతావా?

Sakshi | Updated: January 11, 2017 11:24 (IST)
కెప్టెన్సీ లేదుగా... సిక్సర్లు కొడతావా?
ధోని, యువీ ఆసక్తికర సంభాషణ
ముంబై: మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో చివరి మ్యాచ్‌ ఆడిన యువరాజ్‌ సింగ్.. ‘మిస్టర్ కూల్’పై ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని బెస్ట్ కెప్టెన్ అని, అతడి కెప్టెన్సీలో ఆడడం మర్చిపోలేని అనుభూతని పేర్కొన్నాడు. బ్రాబోర్న్‌ స్టేడియంలో ఇంగ్లండ్ లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ధోని నాయకత్వంలో యువరాజ్ సింగ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో యువీ(56), ధోని(68)  అర్ధసెంచరీలతో తమదైన శైలిలో చెలరేగారు. మ్యాచ్ ముగిసిన తర్వాత సరదాగా మాట్లాడుతున్నారు. యువరాజ్ ఎంతో అప్యాయంగా ధోని భుజాలపై చేతులు వేసి మరీ అతడిని ప్రశ్నలు అడిగాడు. ఈ వీడియోను యువీ తన ట్విటర్ పేజీ, ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.

భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ గా ప్రస్థానం గురించి ధోనిని యువీ ప్రశ్నించగా... ‘టీమిండియా కెప్టెన్ గా ప్రయాణం చాలా బాగుంది. నీలాంటి ఆటగాళ్లు ఉండడంతో జట్టు సారథ్య బాధ్యతలు నాకు భారంగా అనిపించలేదు. పదేళ్లు సారథ్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాన’ని సమాధానం చెప్పాడు.

యువరాజ్ మాట్లాడుతూ... ‘అందరి కంటే నువ్వే ఉత్తమ కెప్టెన్. నీ నాయకత్వంలో ఆడడం చాలా అద్భుతంగా అనిపించింది. మూడు మేజర్ టోర్నమెంట్లు, ప్రపంచకప్ గెలవడంతో పాటు టెస్టుల్లో టీమిండియాను నంబర్ వన్ గా నిలిపిన ఘనత నీదేన’ని అన్నాడు. మధ్యలో ధోని జోక్యం చేసుకుని‘నువ్వు ఆరు సిక్సర్లు కొట్టడం మర్చిపోలేన’ని అన్నాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ధోనికి థ్యాంక్స్ చెప్పిన యువీ.. ఇప్పుడు కెప్టెన్సీ లేదు కాబట్టి ఎక్కువ సిక్సర్లు కొట్టగలవా అని ప్రశ్నించాడు. అన్ని అనుకూలిస్తే ఎక్కువ సిక్సర్లు బాదునని ధోని బదులిచ్చాడు. యువీ, ధోని ఎంతో అప్యాయంగా మాట్లాడుకున్న ఈ వీడియో చూసి అభిమానులు సంబరపడుతున్నారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

50 మందికి పైగా మృతి?

Sakshi Post

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC