విండీస్ కెప్టెన్ చెత్త రికార్డు


సిడ్నీ: వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ తన పేరిట ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో 10 ఓవర్లలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డు నమోదు చేశాడు. మ్యాచ్ ప్రారంభంలో మొదటి రెండు ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండానే అదరగొట్టిన ఈ బౌలర్.. చివర్లో డెవిలియర్స్ పుణ్యమా అని ఏకంగా 10 ఓవర్లలో 104 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా 1983 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ బౌలర్ స్నెడెన్ 12 ఓవర్లలో 105 పరుగులిచ్చాడు. అప్పుడు ఒక్కో బౌలర్ 12 ఓవర్లు బౌలింగ్ చేసేవాడు. 60 ఓవర్ల చొప్పున ఒక్కో ఇన్నింగ్స్ సాగేది. ఆ తర్వాత వన్డేలను 50 ఓవర్లకు కుదించడం, ఒక్కో బౌలర్ గరిష్టంగా 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసేలా నిబంధనలు మార్చిన సంగతి తెలిసిందే.

 


దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ లో హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్లో డివిల్లీర్స్ 4, 6, 2, 4, 4, 4 2, 6 బాదాడు. హోల్డర్ రెండు నోబాల్స్ వేశాడు. ఈ ఓవర్లో ఏకంగా 34 పరుగులు వచ్చాయి. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో డివిల్లీర్స్ వరుసగా 2, 6, 6, 4, 6, 6తో అలరించాడు. ఈ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top