ప్యాడ్స్ లేకుండా... ధోని కీపింగ్


పెర్త్: మైదానంలో కొత్త తరహా వ్యూహాలే కాకుండా కాస్త భిన్నంగా వ్యవహరించడంలో ధోని చాలా సార్లు తన ప్రత్యేకతను ప్రదర్శిస్తాడు. కొన్ని సార్లు సరదాగా, మరికొన్ని సార్లు ఏదో కొత్త ప్రణాళికతో అలా చేస్తాడు. విండీస్‌తో మ్యాచ్‌లో కూడా అది కనిపించింది.

 

 విండీస్ బ్యాటింగ్ సమయంలో 14వ ఓవర్లో నాలుగు బంతుల పాటు ప్యాడ్స్ కట్టుకోకుండా వికెట్ కీపింగ్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి దృశ్యం అసాధారణం! ప్యాడ్స్ లేకుండా వికెట్ కీపర్ కనిపించడం అరుదు. అశ్విన్ రెండు బంతులు విసిరాక వ్యూహం మార్చాలని భావించిన కెప్టెన్... సిల్లీ పాయింట్‌లో రహానేను నిలబెట్టాడు. ప్రమాదకర ఆ స్థానంలో ఫీల్డర్‌కు ప్యాడ్లు తప్పనిసరి. అయితే ఓవర్ మధ్యలో సబ్‌స్టిట్యూట్‌తో ప్యాడ్‌లు తెప్పించడం కుదరదు కాబట్టి తన ప్యాడ్లు విప్పి రహానేకు ఇచ్చాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top