ఎన్నాళ్లకెన్నాళ్లకు...

ఎన్నాళ్లకెన్నాళ్లకు...


ప్రపంచకప్‌లో తొలిసారి జట్టుగా రాణించిన పాకిస్తాన్   

 129 పరుగులతో యూఏఈపై విజయం


 

 నేపియర్: ప్రపంచకప్‌లో తొలిసారి పాకిస్తాన్ జట్టు సమష్టిగా అన్ని విభాగాల్లోనూ రాణించి ఓ పెద్ద విజయం సాధించింది. యూఏఈతో బుధవారం మెక్‌లీన్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 129 పరుగులతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండో విజయం సాధించిన మిస్బా సేన క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. టాస్ గెలిచిన యూఏఈ ఫీల్డింగ్ ఎంచుకోగా... పాకిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 339 పరుగుల భారీ స్కోరు సాధించింది.

 

 నాసిర్ జంషేద్(4) విఫలమైనా... మరో ఓపెనర్ షెహ్‌జాద్ (105 బంతుల్లో 93; 8 ఫోర్లు, 1 సిక్సర్), హారిస్ సోహైల్ (83 బంతుల్లో 70; 5 ఫోర్లు, 1 సిక్సర్) రెండో వికెట్‌కు 160 పరుగులు జోడించి భారీస్కోరుకు పునాది వేశారు. మఖ్‌సూద్ (31 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మిస్బావుల్ హక్ (49 బంతుల్లో 65; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. చివర్లో ఆఫ్రిది (7 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా చెలరేగాడు. దీంతో పాక్ ఈ టోర్నీలో తొలిసారి 300పైచిలుకు స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్ గురుగే 4 వికెట్లు తీసుకున్నాడు.

 

 యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 210 పరుగులు చేసి ఓడిపోయింది. 25 పరుగులకే టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ముగ్గురూ పెవిలియన్‌కు చేరారు. ఖుర్రమ్ ఖాన్ (54 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్సర్), షైమాన్ అన్వర్ (88 బంతుల్లో 62; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి నాలుగో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. పాటిల్ (36), జావెద్ (40) ఫర్వాలేదనిపించారు. అయితే లక్ష్యం మరీ పెద్దది కావడంతో యూఏఈ ఏ దశలోనూ మ్యాచ్‌లో నిలబడలేకపోయింది. సోహైల్ ఖాన్, రియాజ్, ఆఫ్రిది రెండేసి వికెట్లు తీసుకున్నారు.

 

 స్కోరు వివరాలు: పాకిస్తాన్ ఇన్నింగ్స్: జంషేద్ (సి) ఖుర్రమ్ (బి) గురుగే 4; షెహ్‌జాద్ రనౌట్ 93; హారిస్ సోహైల్ (సి) అన్వర్ (బి) నవీద్ 70; మఖ్‌సూద్ (సి) ముస్తఫా (బి) గురుగే 45; మిస్బావుల్ హక్ (సి) ముస్తఫా (బి) గురుగే 65; ఉమర్ అక్మల్ (సి) అమ్జద్ (బి) గురుగే 19; ఆఫ్రిది నాటౌట్ 21; రియాజ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 339 వికెట్ల పతనం: 1-10; 2-170; 3-176; 4-251; 5-312; 6-312; బౌలింగ్: నవీద్ 10-0-50-1; గురుగే 8-0-56-4; అమ్జద్ 9-0-76-0; తౌఖిర్ 10-0-52-0; ఖుర్రమ్ 3-0-21-0; క్రిష్ణ చంద్రన్ 8-0-58-0; ముస్తఫా 2-0-23-0. యూఏఈ ఇన్నింగ్స్: అమ్జద్ (బి) రాహత్ 14; బెరెంగర్ (సి) ఉమర్ (బి) సోహైల్ 2; చంద్రన్ (సి) ఉమర్ (బి) సోహైల్ 0; ఖుర్రమ్ (సి) వహబ్ (బి) మఖ్‌సూద్ 43; అన్వర్ (సి) జంషేడ్ (బి) ఆఫ్రిది 62; పాటిల్ (బి) వహబ్ 36; ముస్తఫా (సి) షెహ్‌జాద్ (బి) ఆఫ్రిది 0; జావెద్ (సి) సోహైల్ (బి) వహబ్ 40; నవీద్ నాటౌట్ 0; తౌఖిర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 210 వికెట్ల పతనం: 1-19; 2-19; 3-25; 4-108; 5-140; 6-140; 7-208; 8-210; బౌలింగ్: ఇర్ఫాన్ 3-1-2-0; సోహైల్ ఖాన్ 9-2-54-2; రాహత్ అలీ 10-0-30-1; వహబ్ రియాజ్ 10-1-54-2; ఆఫ్రిది 10-1-35-2; మఖ్‌సూద్ 5-0-16-1; హారిస్ సోహైల్ 3-0-18-0.

 

 2 వన్డేల్లో 8 వేల పరుగులు, 300 వికెట్లు సాధించిన రెండో ఆల్‌రౌండర్ ఆఫ్రిది. గతంలో జయసూర్య (శ్రీలంక) మాత్రమే ఈ ఘనత సాధించాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top