భారత ఆటగాళ్ల వేతనంలో కోత


ముంబై: బీసీసీఐ ఖజానా నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఆటగాళ్లకు రావాల్సిన మొత ్తంలో రూ.38 కోట్ల మేరకు కోత పడింది. మీడియా హక్కుల నుంచి తగినంత ఆదాయం రాకపోవడమే దీనికి కారణం. ‘క్రికెట్ కార్యకలాపాల ఆదాయం 2012-13 ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.551 కోట్ల నుంచి రూ.516 కోట్లకు తగ్గింది. మీడియా హక్కుల నుంచి స్థూల ఆదాయం రూ.774 కోట్ల నుంచి రూ.419 కోట్లకు పడిపోయింది.

 

  స్వదేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు తక్కువగా జరగడమే ఈ నష్టానికి కారణం. దీంతో ఆటగాళ్లకు ఇవ్వాల్సిన స్థూల ఆదాయ వాటా రూ.49 కోట్ల నుంచి రూ.11 కోట్లకు తగ్గింది’ అని బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌధరి తెలిపారు. అయితే ఐపీఎల్‌కు మాత్రం ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో కాసుల పంట పండింది. 2012-13లో రూ.892 కోట్ల స్థూల ఆదాయం లభిస్తే... ప్రస్తుతం అది రూ.1,194 కోట్లకు చేరింది. ఐపీఎల్ మీడియా రైట్స్ ఆదాయం రూ.556 నుంచి రూ.844 కోట్లకు చేరిందని చౌధరి తెలిపారు. బోర్డు మిగులు ఆదాయం రూ.526 కోట్లని చెప్పారు.


 ఐపీఎల్ జట్ల ఆర్థిక లావాదేవీలపై నిఘా

 కోచి: ఐపీఎల్ జట్ల ప్రమోటర్ల ఆదాయ వ్యవహారాలపై సూక్ష్మ స్థాయిలో పరిశీలన ఉంటుందని నూతనంగా ఎన్నికైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు, ఐపీఎల్ పాలక మండలి సభ్యుడు అయిన టీసీ మ్యాథ్యూ తెలిపారు. ఐపీఎల్ పూర్వ ప్రతిష్టను నిలబెట్టేందుకే ఈ ప్రయత్నాలని చెప్పారు. ఐపీఎల్ జట్లలో ఎవరు అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు.. వాటాలు ఎలా బదిలీ అవుతున్నాయి లాంటి విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే ఆమోదిస్తామని అన్నారు. కోర్టు నుంచి నిర్దోషిగా బయటపడితే కేరళ పేసర్ శ్రీశాంత్ తిరిగి క్రికెట్ బరిలోకి దిగేందుకు సహాయపడతానని మ్యాథ్యూ చెప్పారు.





 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top