22న అడిలైడ్‌లో... 23న పుణేలో

22న అడిలైడ్‌లో... 23న పుణేలో


ఒక్క రోజు వ్యవధిలోనే రెండు మ్యాచ్‌లు ఆడనున్న ఆస్ట్రేలియా

భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్ షెడ్యూల్ విడుదల 




న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచ క్రికెట్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో చెప్పేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌ను చూస్తే అర్థమవుతుంది. ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు సంబంధించిన తేదీలను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నారుు. అరుుతే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ షెడ్యూల్ అటు ఆస్ట్రేలియా జట్టును తెగ ఇబ్బందిపెట్టనుంది. ఎందుకంటే ఈ సిరీస్ ప్రారంభానికి ఒక్క రోజు ముందే (ఫిబ్రవరి 22న) ఆసీస్ జట్టు అడిలైడ్‌లో శ్రీలంకతో టి20 డే అండ్ నైట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అంటే ఒక్క రోజు వ్యవధిలోనే ఆ జట్టు పుణేలో జరిగే తొలి టెస్టుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. దీంతో ఆసీస్ పూర్తిగా రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే కెప్టెన్ స్టీవ్ స్మిత్, డాషింగ్ ఓపెనర్ వార్నర్, స్టార్క్‌లాంటి స్టార్ ఆటగాళ్లు టి20 సిరీస్‌కు దూరం కావాల్సిందే. గతంలో కూడా ఆసీస్ జట్టుకు ఇలాంటి అనుభవం ఎదురైంది. 2014, నవంబర్ 3న అబుదాబిలో పాక్‌తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం 5న అడిలైడ్‌లో దక్షిణాఫ్రికాతో టి20 మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అరుుతే టెస్టు ఆడిన ఆటగాళ్లెవరూ టి20 జట్టులో లేరు.


 

ఇదీ షెడ్యూల్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీగా పిలుచుకునే ఆస్ట్రేలియా, భారత్ మధ్య టెస్టు సిరీస్ షెడ్యూల్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 29 వరకు సాగుతుందని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు. తొలి మ్యాచ్‌కు పుణే ఆతిథ్యమివ్వనుండగా... మార్చి 4 నుంచి 8 వరకు జరిగే రెండో టెస్టు బెంగళూరులో జరుగుతుంది. 16 నుంచి 20 వరకు జరిగే మూడో టెస్టుకు రాంచీ... 25 నుంచి 29 వరకు జరిగే చివరి టెస్టుకు ధర్మశాల తొలిసారిగా ఆతిథ్యమివ్వనున్నారుు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగియగానే ఆసీస్ టెస్టు ఆటగాళ్లు భారత్‌కు రానున్నారు. 


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top