ఇక నీ బౌలింగ్ ఆపు!
దుబాయ్: న్యూజిలాండ్ ఆఫ్ స్పిన్నర్ కానె విలియమ్సన్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వేటు వేసింది. అంతర్జాతీయ క్రికెట్ లో బౌలింగ్ చేయకుండా అతడిపై నిషేధం విధించింది. విలియమ్సన్ బౌలింగ్ వేసే విధానం నియమ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ స్వతంత్ర సంస్థ జరిపిన విశ్లేషణలో తేలడంతో ఈ చర్య తీసుకుంది.
అతడిపై విధించిన నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని ఐసీసీ ప్రకటించింది. దీంతో వివాస్పద బౌలింగ్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో బౌలింగ్ చేయకుండా నిషేధం ఎదుర్కొన్న తొలి న్యూజిలాండ్ క్రికెటర్ గా విలియమ్సన్ నిలిచాడు. గత నెలలో వెస్టిండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో అతడి బౌలింగ్ తీరును కార్డిఫ్ స్పోర్ట్స్ స్కూల్ విశ్లేషించి నివేదిక సమర్పించడంతో విలియమ్సన్ పై వేటు పడింది.
సంబంధిత వార్తలు