'పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తుంది. ఈ తృప్తి చాలు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం క్రీడలుకథ

ధోనితో కలిసి దూకుడుగా...

Sakshi | Updated: January 10, 2017 01:56 (IST)
ధోనితో కలిసి దూకుడుగా...

ఇద్దరం చెలరేగిపోతామంటున్న యువరాజ్‌ సింగ్‌
ముంబై: కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని, తాను కలిసి ఒకప్పటిలా ప్రత్యర్థులపై విరుచుకు పడతామని యువరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు. మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్‌... తామిద్దరం కలిసి ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. జట్టులో సభ్యుడిగా ధోని మరెన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడగలడని యువీ అన్నాడు. ‘మా కెరీర్‌ ఆరంభించిన రోజులు మరోసారి రానున్నాయి. నేను నిజానికి అతనికంటే చాలా ముందుగానే జట్టులోకి వచ్చినా... మేమిద్దరం కలిసి ఆడినప్పుడు మాత్రం చాలా నిర్భయంగా, దూకుడైన ఆటను ప్రదర్శించాం.

రాబోయే సిరీస్‌లో దీనిని మేమిద్దరం మరోసారి చేసి చూపించగలం’ అని యువరాజ్‌ చెప్పాడు. ధోని సాధించిన ఘనతల జాబితా చూస్తేనే అతను అత్యుత్తమ కెప్టెన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదని, కెప్టెన్సీ నుంచి సరైన సమయంలో తప్పుకొని మంచి నిర్ణయం తీసుకున్నాడని ఈ పంజాబ్‌ ఆటగాడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. వయసు పెరుగుతుండటం వల్ల శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు తాను మరింత ఎక్కువగా శ్రమిస్తున్నానన్న యువరాజ్‌... కొత్త కెప్టెన్‌ కోహ్లి తమ నుంచి 100 శాతం ప్రదర్శనను ఆశిస్తాడనే విషయం గుర్తుందన్నాడు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

50 మందికి పైగా మృతి?

Sakshi Post

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC