విరాట్ కఠోర సాధన!
కింగ్స్టన్:ఇటీవల కాలంలో అసాధారణ ఫామ్‌లో ఉన్న క్రికెటర్ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. మరింత మెరుగైన ప్రదర్శనపై దృష్టి పెట్టాడు. దీనిలో భాగంగా కఠోరమైన సాధనను చేసేందుకు వెనుకాడటం లేదు. తన ఫామ్ మెరుగుపడటానికి ఫిట్నెస్ కారణమంటున్న కోహ్లి.. చేస్తే కఠోరమైన శిక్షణ చేయాలంటున్నాడు. ఒకవేళ కానిపక్షంలో కసరత్తులను మొత్తానికే పక్కను పెట్టాలంటున్నాడు.
దీనిలో భాగంగా కింగ్స్టన్లోని జిమ్‌కు వెళ్లిన కోహ్లి వెయిట్ లిఫ్టింగ్‌తో సరికొత్త సాధన చేశాడు. ఇరువైపులా 10 కిలోల బరువున్న బార్లను వేసుకుని ఇలా వెయిట్‌లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించిన కోహ్లి..రెండో టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆ జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జూలై 30 వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య సబినా పార్క్ లో రెండో టెస్టు ఆరంభం కానుంది. మొదటి టెస్టులో విండీస్‌కు చుక్కలు చూపించిన కోహ్లి.. రెండో టెస్టులో ఆతిథ్య జట్టును ఎలా ఆడుకుంటాడో చూడాలి మరి.