హోమ్ వర్క్ పెద్ద తలపోటు: కోహ్లి

హోమ్ వర్క్ పెద్ద తలపోటు: కోహ్లి


న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో తనదైన స్టైల్తో దూసుకుపోతున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నాడు.  తనకు చిన్ననాటి నుంచి క్రికెట్పై అమితమైన ఆసక్తిని పేర్కొన్న కోహ్లి.. బ్యాడ్మింటన్ కూడా ఎక్కువగా ఆడేవాడినన్నాడు. అయితే స్కూల్ రోజుల్లో ఇచ్చిన హోమ్ వర్క్ ను తాను ఎప్పుడూ పూర్తి చేయలేదన్నాడు.  ' హోమ్ వర్క్ అనేది నాకు భారంగా ఉండేది. అది పూర్తి చేయడమంటే నాకు పెద్ద తలపోటు. ప్రత్యేకంగా సెలవురోజుల్లో హోమ్ వర్క్ పూర్తి చేయడం అంటే పిల్లలకు చాలా ఒత్తిడికి గురౌతారు. అదే నా జీవితంలో కూడా జరిగింది. ఎప్పుడూ హోమ్ వర్క్ చేయడానికి ఆసక్తి చూపేవాడ్ని కాదు' అని కోహ్లి పేర్కొన్నాడు.



త్వరలో వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతున్న కోహ్లి.. ప్రస్తుతం పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా ఉన్నాడు. దీనిలో భాగంలో ఢిల్లీలో జరిగిన వర్చువల్ గేమింగ్ కార్యక్రమానికి హాజరైన కోహ్లి తన అభిమానులతో కొన్ని జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్నాడు. వర్చువల్ గేమింగ్లో తాను పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నాడు.  ఇదిలా ఉండగా ఆర్సీబీ సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక మ్యాచ్లు ఆడటం వల్ల అక్కడ ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా సులువుగా బ్యాటింగ్ చేయగలగుతున్నానని కోహ్లి అన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top