కోహ్లితో పాటు నేను కూడా..

కోహ్లితో పాటు నేను కూడా..


ముంబై:ఇటీవల కాలంలో  తన ఆట తీరు ఎంతో మెరుగైందని టాపార్డర్ ఆటగాడు అజింక్యా రహానే స్పష్టం చేశాడు. తాను అంతర్జాతీయ అరంగేట్రం చేసే నాటికీ, ఇప్పటీకీ తన ఆటలో చాలా మార్పు వచ్చిందన్నాడు.  భారత క్రికెట్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తరహాలో తనకు కూడా ఎప్పుడూ దూకుడును కొనసాగించడమంటే ఇష్టమన్నాడు. ఈ సందర్భంగా 2013లో డర్బన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ను రహానే ప్రస్తావించాడు.


 


'ఆ మ్యాచ్లో విరాట్ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశా. తొలి ఇన్నింగ్స్లో 51 పరుగులతో అజేయంగా నిలిస్తే.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులతో సెంచరీని కోల్పోయాను. అది నాకు అరంగేట్రం టెస్టు మ్యాచ్. అయితే నేను బ్యాటింగ్ చేసే సమయంలో డేల్ స్టెయిన్ వేసిన ఒక బంతి నా హెల్మెట్కు తగిలింది. ఆ సమయంలో విరాట్ వచ్చి ఎదురుదాడికి దిగమన్నాడు. దానికి సానుకూలంగా స్పందించి దక్షిణాఫ్రికా బౌలింగ్ పై ఎటాక్ చేశా. దాంతో మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశాం. ఇదే తరహా ఆటతీరు మా మధ్య ఆది నుంచి కొనసాగుతుంది. మేమద్దరం సహకరించుకునే తీరు బాగుంటుంది. విరాట్తోపాటు నేను కూడా దూకుడును కొనసాగించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు ' అని రహానే తెలిపాడు. అయితే తమ ఇద్దరి దూకుడులో మాత్రం వ్యత్యాసముందని పేర్కొన్న రహానే.. తమ ఇద్దరి కాంబినేషన్ మాత్రం సక్సెస్ అయినట్లు తెలిపాడు.



వీరిద్దరూ 21 టెస్టుల్లో 54.70 సగటుతో 1094 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇందులో మూడు సెంచరీల భాగస్వామ్యం కూడా నమోదు కావడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top