15 ఏళ్ల అమ్మాయి సంచలనం

15 ఏళ్ల అమ్మాయి సంచలనం - Sakshi


యూఎస్ ఓపెన్ రెండో రోజు పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 1208వ ర్యాంకర్, 15 ఏళ్ల క్యాథరిన్ కార్టన్ బెలిస్ (అమెరికా) 6-1, 4-6, 6-4తో ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్, 12వ సీడ్ డొమ్నికా సిబుల్కోవా (స్లొవేకియా)పై గెలిచి కోలుకోలేని షాకిచ్చింది.



దీంతో అన్నా కోర్నికోవా (1996లో 15 ఏళ్ల వయసులో) తర్వాత యూఎస్ ఓపెన్‌లో మ్యాచ్ గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా 1999లో తొలిసారి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచినప్పుడు బెలిస్ వయసు ఐదు నెలల కంటే తక్కువ. మరోవైపు పురుషుల సింగిల్స్‌లోనూ సంచలనం నమోదయింది. 17 ఏళ్ల బోర్నా కోరిక్ (క్రొయేషియా) 6-4, 6-1, 6-2తో 29వ సీడ్ లుకాస్ రాసోల్ (చెక్)ను ఓడించి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top