షెహజాద్ కు రెండు 'లైఫ్'లు
నెపియర్: యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాట్స్ మన్ అహ్మద్ షెహజాద్ కు రెండు 'లైఫ్'లు లభించాయి. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్ ను యూఏఈ ఫీల్డర్ గురుగీ వదిలేశాడు. షెహజాద్ ముందుకు వచ్చిన ఆడిన షాట్ తో బంతి గాల్లోకి లేచింది. తనకంటే ఎత్తులో వెళుతున్న బంతిని పట్టుకునేందుకు గురుగీ ఒంటిచేత్తో పట్టుకునేందుకు గట్టి ప్రయత్నం చేశాడు.
12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షెహజాద్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను మహ్మద్ నవీద్ వదిలేయడంతో అతడికి మరో లైఫ్ లభించింది.