రోలర్ స్కేటింగ్ హాకీలో తెలంగాణకు కాంస్యం

రోలర్ స్కేటింగ్ హాకీలో తెలంగాణకు కాంస్యం - Sakshi


గోల్నాక: జాతీయ రోలర్ స్కేటింగ్ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా చాటుకుంది. ఈ నెల 19 నుంచి 24 వరకు ముంబైలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ సబ్ జూనియర్ బాలికల జట్టు మహారాష్ట్రపై 6-1 గోల్స్‌తో నెగ్గి కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విజయంలో పాలుపంచుకున్న క్రీడాకారిణులు రియా, దుర్గేష్ నందిని జాధవ్, అవంతిక, నందిని, ఫాతిమా, స్వాతి సింగ్, వంశితా, సియా, సాదియా సుల్తానా, ఆస్థాలను కోచ్‌లు అభినందించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top