రాత మార్చిన టోర్నీ

రాత మార్చిన టోర్నీ


1983... భారత క్రికెట్ చరిత్రలో మరచిపోలేని ఏడాది. దేశంలో ఈ ఆట రాతను మార్చిన సంవత్సరమది. క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని వెస్టిండీస్ ఆధిపత్యానికి భారత్ గండి కొట్టింది ఈ ప్రపంచకప్‌లోనే. దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు జగజ్జేతగా అవతరించింది. తొలి రెండు ప్రపంచకప్‌లలో కనీసం లీగ్ దశ దాటలేకపోయిన భారత్... ఈ టోర్నీలోనూ అంచనాల్లేకుండా బరిలోకి దిగింది. ఈసారి ఆడిన తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి సంచలనం సృష్టించింది.



అదే రోజు జింబాబ్వే కూడా ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఈ ప్రపంచకప్‌ను సంచలనాల టోర్నీగా మార్చింది. లీగ్ దశలో జింబాబ్వే చేతిలో ఓటమి తప్పదనుకున్న దశలో కపిల్‌దేవ్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడి 175 పరుగులు చేశాడు. ఆ స్ఫూర్తితో భారత్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి భారత్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది.

 

ఆతిథ్యం: ఇంగ్లండ్; వేదికలు: 15; పాల్గొన్న జట్లు (8): భారత్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జింబాబ్వే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top