నా కల నెరవేరింది: కుల్దీప్ యాదవ్

నా కల నెరవేరింది: కుల్దీప్ యాదవ్


ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో టీమిండియా కొత్త కుర్రాడు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించాడు. కుల్దీప్‌తో పాటు ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు, అశ్విన్, జడేజా, భువనేశ్వర్ తలో వికెట్ తీయడంలో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత అరంగేట్ర కుర్రాడు కుల్దీప్ మీడియాతో మాట్లాడాడు. ' నేడు నా కల నెరవేరింది. చాలా సంతోషంగా ఉన్నాను. ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తొలుత చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. బంతి అందుకుని తొలి ఓవర్ వేశాక టెన్షన్ కాస్త తగ్గింది' అని టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ చెప్పుకొచ్చాడు.



'బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉంది. బంతి అంతగా టర్న్ కావడం లేదు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం కలిసొచ్చింది. హ్యాండ్ స్కాంబ్ కోసం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. పిచ్ నుంచి స్పిన్నర్లకు కాస్త తోడ్పాడు అందుతుంది' అని అరంగేట్ర ప్లేయర్ కుల్దీప్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఆసీస్-భారత్ జట్లకు ఈ టెస్ట్ విజయం కీలకం. అలాంటి మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న కుల్దీప్.. టాప్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు వికెట్ల వేటలో వెనకంజ వేయగా కీలక వికెట్లతో రాణించాడు. డేవిడ్ వార్నర్(56), హ్యాండ్ స్కాంబ్(8), గ్లెన్ మ్యాక్స్‌వెల్(8), కమిన్స్(21) ల వికెట్లు తనఖాతాలో వేసుకుని భారీ స్కోరు చేయకుండా ఆసీస్ ను నిలువరించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top