మూడో రౌండ్లో సాత్విక

మూడో రౌండ్లో సాత్విక


♦ శివాని, శ్రీవత్స, సిద్ధార్థ్‌ల ఓటమి

♦ ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీ

 

 సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అండర్-18 జూనియర్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బాలికల సింగిల్స్‌లో టాప్ సీడ్ సామ సాత్విక, హర్షసాయి చల్లా మూడో రౌండ్లోకి అడుగుపెట్టగా, అమినేని శివాని, షేక్ హుమేర రెండో రౌండ్లోనే నిష్ర్కమించారు. బాలుర ఈవెంట్‌లో పొన్నాల సిద్ధార్థ్, శ్రీవత్స రాతకొండలు కూడా రెండో రౌండ్లోనే ఓడారు. తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలోని ‘శాట్స్’ టెన్నిస్ కాంప్లెక్స్‌లో మంగళవారం జరిగిన బాలికల సింగిల్స్ రెండో రౌండ్లో సాత్విక 6-1, 6-2తో బాని సింగ్‌పై అలవోక విజయం సాధించింది.



హర్షసాయి చల్లా 6-1, 6-3తో నాలుగో సీడ్ మరియా డామినిక్ (ఫిలిప్పీన్స్)ను కంగుతినిపిం చగా, సాయి నిఖిత 6-3, 4-1తో తొమ్మిదో సీడ్ లలిత దేవరకొండపై ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. మూడో సీడ్ మహక్ జైన్ 6-3, 6-0తో అమినేని శివానిపై, జుల్ యున్ చాంగ్ (చైనీస్ తైపీ) 6-1, 6-1తో షేక్ తహూరాపై, ఆర్జా చక్రబర్తి 6-4, 6-4తో షేక్ హుమేరా బేగంపై, ఆరో సీడ్ శివాని మంజన్న 6-1, 6-0తో ప్రతిభా నారాయణ్‌పై గెలుపొందారు.



 బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో పొన్నాల సిద్ధార్థ్ 6-3, 0-6, 4-6తో ఆదిల్ కళ్యాణ్‌పూర్ చేతిలో, శ్రీవత్స రాతకొండ 3-6, 6-2, 4-6తో 12వ సీడ్ సిద్ధాంత్ బాంటియా చేతిలో పరాజయం చవిచూశారు. రెండో సీడ్ చెరుకు వశిష్ట్ 6-1, 6-2తో నతాసిత్ కున్‌సువాన్ (థాయ్‌లాండ్)పై, శ్రమయ్ ధావన్ 7-5, 6-4తో అలిస్టెర్ మగలిట్ (హాంకాంగ్)పై గెలిచారు.



మిగతా మ్యాచ్‌ల్లో పరీక్షిత్ సొమాని 4-6, 6-1, 6-1తో ముత్తు ఆదిత్య సెంథిల్ కుమార్‌పై, షాహిద్ అలమ్ (సింగపూర్) 6-3, 6-4తో శివదీప్ కొసరాజుపై, ధ్రువ్ సునీశ్ 6-4, 6-2తో రిషిరెడ్డిపై, సాగర్ బైన్స్ 6-0, 3-6, 6-4తో అనిరుధ్ చంద్రశేఖర్‌పై, సాహిల్ దేశ్‌ముఖ్ 7-6 (7/5), 7-6 (8/6)తో బాజ్వపై, రియాన్ పండోలే 6-1, 6-2తో అన్షుమన్ గులియాపై, ఇశాక్ ఇక్బాల్ 7-6తో యుగల్ బన్సాల్ (రిటైర్డ్‌హర్ట్)పై, సానిల్ జగ్యాని 6-3, 1-6, 7-5తో శ్రేయ్ గుప్తాపై, మయూక్ రావత్ 3-6, 7-6 (7/3), 6-4తో రాఘవ్‌పై, పరమ్ 4-6, 6-2, 6-3తో గౌరంగ్‌పై, అనురాగ్ 6-2, 4-6, 6-2తో అల్విన్ (మలేసియా)పై, అలెక్స్ సోలంకి 4-6, 6-1, 6-2తో అభిమన్యుపై విజయం సాధించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top