త్వరలో ధోనీకి ప్రమోషన్!

త్వరలో ధోనీకి ప్రమోషన్!


భారతదేశానికి ప్రపంచకప్ తీసుకొచ్చిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. త్వరలోనే ప్రమోషన్ కొట్టబోతున్నాడు. ఆస్ట్రేలియాతో ఆ దేశంలోనే జరిగిన సిరీస్లో జట్టు దారుణ వైఫల్యాలు చవిచూసినందుకు ప్రపంచమంతా తిట్టిపోస్తుంటే.. మధ్యలో ఈ ప్రమోషన్ ఏంటా అనుకుంటున్నారా?



అవును.. ధోనీ ప్రమోషన్ కొట్టేస్తున్నాడు. త్వరలోనే టీమిండియా కెప్టెన్ తండ్రి కాబోతున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ చదివి, తన చిన్ననాటి స్నేహితుడైన ధోనీని పెళ్లి చేసుకున్న సాక్షి.. త్వరలోనే తల్లి కాబోతోంది. ప్రపంచంలో ఎక్కడ టీమిండియా ఆడుతున్నా.. అక్కడకు తప్పనిసరిగా వెళ్లి చూసే సాక్షి.. ఈసారి మాత్రం ప్రపంచకప్ మ్యాచ్లకు వెళ్తుందో లేదో అనుమానమే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top