ఫెడరర్‌ తొమ్మిదోసారి...

ఫెడరర్‌ తొమ్మిదోసారి...


హాలె వెస్ట్‌ఫాలెన్‌ (జర్మనీ): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ తొమ్మిదోసారి గెబెర్‌ హాలెర్రీ వె ఓపెన్‌ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెడరర్‌ 6–1, 6–3తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలిచాడు.



గతంలో ఫెడరర్‌ 2003, 04, 05, 06, 08, 2013, 14, 15లలో ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. కెరీర్‌లో 92వ సింగిల్స్‌ టైటిల్‌ సాధించిన ఫెడరర్‌... ఓపెన్‌ శకంలో (1968 తర్వాత) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికసార్లు గెలిచిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ రికార్డు స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్, బార్సిలోనా ఓపెన్, మోంటెకార్లో ఓపెన్‌–10 సార్లు చొప్పున) పేరిట ఉంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top