నేటి నుంచి సన్‌రైజర్స్‌ ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు

నేటి నుంచి సన్‌రైజర్స్‌ ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు


సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌–10 సీజన్‌ టికెట్ల విక్రయానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను నేటి (శనివారం) నుంచి విక్రయించనున్నారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా 7 మ్యాచ్‌లలో తలపడుతుంది. ప్రతీ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను నగరంలోని పలు స్టేడియాలతో పాటు ఎంపిక చేసిన కొన్ని షాపింగ్‌ మాల్స్‌లో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఆన్‌లైన్‌లో టికెట్ల కోసం www. sunrisershyderabad.in సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. రెండు వారాలుగా కొనసాగుతున్న హెచ్‌సీఏ గ్రౌండ్స్‌మెన్‌ సమ్మె శుక్రవారం ముగియడంతో ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు మార్గం సుగమమైంది.



సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్, బషీర్‌బాగ్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియం, ఉప్పల్‌లోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకు టికెట్లను విక్రయిస్తారు.



జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్‌ షాపింగ్‌ మాల్‌తో పాటు, నగరంలోని పలు ‘జస్ట్‌ బేక్‌’ ఔట్‌లెట్ల (అత్తాపూర్, గచ్చిబౌలి, మలక్‌పేట్, ఎస్‌ఆర్‌ నగర్, మదీనాగూడ, ఏఎస్‌ రావు నగర్, శివం రోడ్‌)లో మధ్యాహ్నం 12  నుంచి రాత్రి 9 గంటల వరకు టికెట్లు అమ్ముతారు.



వీటితో పాటు కరీంనగర్‌లోని ప్రతిమ మల్టిప్లెక్స్, వరంగల్‌లోని గ్రీన్‌ స్క్వేర్‌ ప్లాజా, నిజామాబాద్‌లోని ఉషా మయూరి మల్టిప్లెక్స్‌లలోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టికెట్లను పంపిణీ చేస్తారు. బల్క్, కార్పొరేట్‌ బుకింగ్స్‌ కోసం ‘ఈవెంట్స్‌ నౌ’ ప్రతినిధులను (89787 81831) సంప్రదించవచ్చు.



హైదరాబాద్‌లో జరిగే ఏడు మ్యాచ్‌లకు కలిపి ఒకే ‘సీజన్‌ పాస్‌’ తీసుకోవాలనుకునే వారికి చార్జీలో 5 శాతం రాయితీ దక్కుతుంది. టీమ్‌ జెర్సీనీ ఉచితంగా అందజేస్తారు. ఏప్రిల్‌ 4లోగా సీజన్‌ పాస్‌ తీసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.   





 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హోంగ్రౌండ్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌



తేదీ    ప్రత్యర్థి     సమయం

ఏప్రిల్‌ 5    రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు    రాత్రి గం. 8 నుంచి

ఏప్రిల్‌ 9    గుజరాత్‌ లయన్స్‌    సా. గం. 4 నుంచి

ఏప్రిల్‌ 17    కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌    రాత్రి గం. 8 నుంచి

ఏప్రిల్‌ 19     ఢిల్లీ డేర్‌డెవిల్స్‌    రాత్రి గం. 8 నుంచి

ఏప్రిల్‌ 30     కోల్‌కతా నైట్‌ రైడర్స్‌    రాత్రి గం. 8 నుంచి

మే 6     రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌    సా. గం. 4 నుంచి

మే 8    ముంబై ఇండియన్స్‌    రాత్రి గం. 8 నుంచి



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top