ప్రపంచ కప్‌నుంచి తప్పుకున్న నరైన్

ప్రపంచ కప్‌నుంచి తప్పుకున్న నరైన్


ట్రినిడాడ్: ప్రపంచ కప్ టోర్నీకి ముందు వెస్టిండీస్ జట్టుకు షాక్ తగిలింది. అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ జట్టునుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన బౌలింగ్ యాక్షన్‌ను సరిదిద్దుకునేందుకు మరి కొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లు అతను చెప్పాడు. గత ఏడాది చాంపియన్స్ లీగ్‌లో నరైన్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశాక అతను అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.



‘వెస్టిండీస్ జట్టు ప్రయోజనాల కోసం, నా వ్యక్తిగత ఆలోచన ప్రకారం కూడా నేను తప్పుకోవాలని నిర్ణయించాను. నా యాక్షన్ సరిదిద్దుకోవడంలో కొంత మెరుగుదల కనిపించినా, 100 శాతం నమ్మకం లేకుండా ప్రపంచ కప్ బరిలోకి దిగడం సరైంది కాదని భావిస్తున్నా’ అని నరైన్ చేసిన ప్రకటనను విండీస్ బోర్డు విడుదల చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top