హాంకాంగ్ ఓపెన్‌లో శ్రీకాంత్ ఓటమి
హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో తెలుగుతేజం శ్రీకాంత్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 17-21 21-19 6-21 స్కోరుతో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. గంటకుపైగా సాగని పోరులో శ్రీకాంత్ అద్భుతంగా ఆడినా చివర్లో ప్రత్యర్థిని నిలువరించలేకపోయాడు. గతవారం జరిగిన చైనా ఓపెన్ సిరీస్‌లో శ్రీకాంత్ సంచలన విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.