రోహిత్ శర్మ క్రికెట్ యాప్!

రోహిత్ శర్మ క్రికెట్ యాప్!


బెంగళూరు: భారత్ లో క్రికెట్ కు ఉన్న ఆదరణ తెలియంది కాదు. ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానుల్లో దాదాపు నలభై శాతం మంది భారత్ లోనే ఉన్నారు.   దీన్నిసద్వినియోగం చేసుకోవాలని భావించిన యూకేకు చెందిన స్పోర్ట్ రైట్ నౌ న్యూస్ ప్రొవైడర్ సరికొత్త క్రికెట్ న్యూస్ యాప్ ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగానే సోమవారం బెంగళూరులో 'రోహిత్ శర్మ క్రికెట్ న్యూస్'  పేరిట  యాప్ ను ప్రారంభించింది.


 


ఈ సందర్భంగా స్పోర్ట్స్ న్యూస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీతా చిన్నప్ప మాట్లాడుతూ..  ఏడాదికి ఒక మిలియన్(10 లక్షలు) డౌన్ లోడ్స్ ను భారత్ లో లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేశారు. భారత్ లో రోజురోజుకూ పురుగుతున్నక్రికెట్ ఆదరణతో తమ గమ్యాన్ని తప్పకుండా చేరుతామన్నారు. సోషల్ మీడియాలో రోహిత్ శర్మకు ఉన్న ఫాలోవర్ల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకున్న అనంతరం అతని పేరు ఖరారు చేసినట్లు చిన్నప్ప పేర్కొన్నారు.  రోహిత్ కు ఫేస్ బుక్ లో 7.5 మిలియన్ల మంది అభిమానులుండగా, ట్విట్టర్ లో 2.8 మిలియన్ల మంది ఫాలోవర్లు  ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. క్రికెట్ టెక్నాలజీకి సంబంధించిన ఆపరేషన్ ను తాము 2010 లో చేపట్టామని.. అందులో ఇప్పటివరకూ ఐదు లక్షల పౌండ్లను  పెట్టుబడిగా  పెట్టినట్లు ఆ కంపెనీ ముఖ్య సలహాదారు సర్వాల్ తెలిపారు.


 


తాజాగా ప్రవేశపెట్టిన ఈ యాప్ తో నిరంతరాయంగా క్రికెట్ న్యూస్ ను పొందే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలోని అనేక రకాలైన ప్లాట్ ఫాం నుంచి క్రికెట్ న్యూస్ ను సేకరించి అందుకు సంబంధించిన డేటాను యాప్ ద్వారా వినియోగదారులకు అందిస్తామన్నారు.  దీంతో పాటు టెన్నిస్, ఫుట్ బాల్ తదితర ఆటలకు సంబంధించిన న్యూస్ యాప్ లను కూడా భారత్ లో ప్రవేశపెట్టడానికి యత్నాలు చేస్తున్నట్లు సర్వాల్ తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top