ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
ఆక్లాండ్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-బీలో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్, దక్షిణఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. గ్రూపు-బీలో 2వ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో గెలియి నాకౌట్ కు చేరాలని భావిస్తోంది.
సఫారీలను కంగుతినిపించి క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పాకిస్థాన్ పట్టుదలతో ఉంది. నాసిర్ జంషేద్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. హరీస్ సొహైల్ స్థానంలో యూనిస్ ఖాన్ ను తీసుకున్నారు.