దక్షిణాఫ్రికా ఎదురీత


తొలి ఇన్నింగ్స్‌లో 98/3  

 శ్రీలంక 421 ఆలౌట్


 

 కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఎదురీదుతోంది. ఆట రెండో రోజు శుక్రవారం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ జట్టు 52 ఓవర్లలో మూడు వికెట్లకు 98 పరుగులు చేసింది. 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి అడుగుపెట్టిన ఆమ్లా (134 బంతుల్లో 46 బ్యాటింగ్; 3 ఫోర్లు) అద్భుత సహనాన్ని చూపుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

 

  అతడికి తోడుగా డివిలియర్స్ (38 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నాడు. డుప్లెసిస్ (109 బంతుల్లో 36; 3 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి ఆమ్లా మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించాడు. అంతకుముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 121.4 ఓవర్లలో 421 పరుగులు చేసింది. జయవర్ధనే (284 బంతుల్లో 165; 17 ఫోర్లు; 1 సిక్స్), తొలి టెస్టు ఆడుతున్న డిక్‌వెల్లా (116 బంతుల్లో 72; 6 ఫోర్లు; 1 సిక్స్) మధ్య ఆరో వికెట్‌కు 100 పరుగులు వచ్చాయి. స్టెయిన్, ఫిలాండర్, డుమినిలకు రెండేసి వికెట్లు దక్కాయి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top