స్మిత్‌కు అవార్డుల పంట

స్మిత్‌కు అవార్డుల పంట


మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ వార్షిక అవార్డుల్లో స్టీవ్ స్మిత్‌కు మూడు పురస్కారాలు దక్కాయి. ప్రతిష్టాత్మక అలెన్ బోర్డర్ మెడల్‌తో పాటు టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కూడా స్మిత్ సాధించాడు. పదేళ్లలో ఈ మూడు అవార్డులూ ఒకే ఆటగాడికి రావడం ఇది మూడోసారి.



బోర్డర్-గవాస్కర్ మెడల్ కోసం నిర్వహించిన ఓటింగ్‌లో స్మిత్‌కు 243 ఓట్లు రాగా... వార్నర్ 175, జాన్సన్ 126 ఓట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. మ్యాక్స్‌వెల్‌కు టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సీన్ అబాట్ ఎంపికయ్యాడు. అతని బౌలింగ్‌లో గాయపడి హ్యూస్ మరణించిన తర్వాత అబాట్ కోలుకుని నిలకడగా రాణించి అవార్డు గెలుచుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top