చిగుంబుర సెంచరీ వృధా

చిగుంబుర సెంచరీ వృధా


లాహోర్: జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. 376 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు జింబాబ్వే పోరాడినప్పటికీ పరాజయం తప్పలేదు. జింబాబ్వే 40 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 334 పరుగులు చేసింది.



కెప్టెన్ చిగుంబుర సెంచరీ వృధా అయింది. చిగుంబుర 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 117 పరుగులు చేశాడు. వన్డేల్లో అతకిది తొలి సెంచరీ. మసకద్జ(73) అర్ధసెంచరీతో రాణించాడు. సికందర్ రాజా 36, విలియమ్స్ 36, సిబంద 23, ఉత్సేయ 21, ముతంబామి 21 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో రియాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. షోయబ్ మాలిక్, అన్వర్ అలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.



టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 375 పరుగులు చేసింది. రెండేళ్ల తర్వాత వన్డేల్లోకి వచ్చిన షోయబ్ మాలిక్ తన వన్డేలో కెరీర్‌లోనే వేగవంతమైన సెంచరీ (76 బంతుల్లో 112; 12 ఫోర్లు; 2 సిక్సర్లు)తో దుమ్ము రేపాడు. ఓపెనర్లు హఫీజ్ (83 బంతుల్లో 86; 8 ఫోర్లు; 4 సిక్సర్లు), అజహర్ అలీ (76 బంతుల్లో 79; 9 ఫోర్లు; 2 సిక్సర్లు), హరీస్ సోహైల్ (66 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. షోయబ్ మాలిక్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో పాకిస్థాన్ 1-0 ఆధిక్యం సాధించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top