మరో వివాదాస్పద వ్యాఖ్య బెస్ట్‌ను కొట్టాల్సిందంటూ ట్వీట్

మరో వివాదాస్పద వ్యాఖ్య బెస్ట్‌ను కొట్టాల్సిందంటూ ట్వీట్


ముంబై: ఇప్పటికే వివాదాల్లో ఉన్న సానియా మీర్జా తాజాగా ఓ ట్వీట్‌తో మరో వివాదానికి తెరలేపింది. తన భర్త షోయబ్ మాలిక్... వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్‌ను కొట్టాల్సిందంటూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో షోయబ్ బార్బడోస్ జట్టు తరఫున ఆడుతున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియాకు ఆడుతున్న బెస్ట్, మాలిక్ మధ్య మైదానంలో గొడవ జరిగింది. ఒకరినొకరు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా... హోటల్‌కు వెళ్లాక పరస్పరం నెట్టుకున్నారు. వ్యవహారం కొట్టుకునే వరకు వెళ్లింది.

 

లీగ్ నిర్వాహకులు ఇద్దరు క్రికెటర్లకు జరిమానా విధించి వివాదాన్ని ముగించారు. అయితే ఈ సంఘటనపై సానియా చేసిన ట్వీట్ కలకలం రేపింది. ‘క్రికెట్ మైదానంలో జాతి వివక్ష దూషణలా? చాలా అసహ్యంగా ఉంది. టినో బెస్ట్ ఇడియట్. లాగి ఒక్కటి కొట్టాల్సింది. షోయబ్ మాలిక్ అతన్ని కొట్టలేదు కానీ.. ఆ పని చేసి ఉండాల్సింది’ అంటూ ట్వీట్ చేసింది. ఓ క్రీడాకారిణి అయి ఉండి ఆటల్లో ఉండే ఉద్వేగాలు తెలిసి ఇలా వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top